టెక్నలజీ పెరుగుతున్న కారును రూపొందించడంలోను మార్పు వచ్చాయి. అయితే  తక్కువ శక్తితో ఎక్కువ వేగంతో ప్రయాణించగల ప్లెయిడ్ మోడ్ మోడల్ ఎస్ కారును వచ్చే ఏడాది చివరినాటికి డెలివరీ చేస్తామని మస్క్ పేర్కొన్నారు. తమ కంపెనీ రూపొందిస్తున్న బ్యాటరీల ధరలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.

అయితే దీనిపై టెస్లా సంస్థ ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తోందని తెలియజేశారు. అయితే కొత్త రకం ట్యాబ్లెస్ బ్యాటరీ సెల్స్‌ను, చార్జింగ్ మెటీరియల్‌ను రూపొందించడం ద్వారా బ్యాటరీల ధరలు తగ్గించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుందని సీఈఓ తెలిపారు. ఇది సాధ్యమైతే ఒక కిలోవాట్ అవర్‌కు అయ్యే ఖర్చు చాలావరకు తగ్గనుందన్నారు. తమ కంపెనీ రూపొందిస్తున్న బ్యాటరీల ధరలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.

ఇక దీనిని 25,000 డాలర్లకే ఎలక్ర్టిక్ కారును అందించాలంటే టెస్లాకు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నారు. మూడేళ్లలో కచ్చితంగా ఈ కారును అందుబాటులోకి తెస్తామని మస్క్ తెలిపారు. కంపెనీ నుంచి వచ్చే కార్లలో ఇదే ధర తక్కువది కానుందని తెలిపారు. ఇక టెస్లా నుంచి 35,000 డాలర్లకు ఎలక్ర్టిక్ మోడల్ 3 కారును అందిస్తామని మస్క్ ఇంతకు ముందే ప్రకటించారు. అన్నట్టుగానే ఆ సంస్థ అదే ధరకు ఎలక్ర్టిక్ కారును అందించింది. దీన్ని యూఎస్‌లో కొద్దికాలంలోనే వినియోగదారులకు అందుబాటులో ఉంచారని తెలిపారు.

అయితే 1,100 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ప్లెయిడ్ మోడ్‌కు ఆర్డర్లు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ అత్యాధునిక ఎలక్ర్టిక్ కారును మూడు మోటార్లతో రూపొందిస్తున్నారు అని అన్నారు. ఈ మోడల్-ఎస్ కారు కేవలం రెండు సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. తొమ్మిది సెకన్లలోనే క్వార్టర్ మైలు వరకు వెళ్లగలదని తెలిపారు. అప్ గ్రేడెడ్ మోడల్- ఎస్ కారును 1,40,000 డాలర్లకు అందించనున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 321కిలోమీటర్లు(200 మైళ్లు) కావడం విశేషం. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 520 మైళ్లు(836 కిమీ) దూరం ప్రయాణించవచ్చునని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: