ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా డిఫెండర్ కార్లు పనిచేసేలా డిజైన్ చేసింది కంపెనీ. కారు బాడీ ఆర్కిటెక్చర్ 291 మీ.మీ గ్రౌండ్ క్లీయరెన్స్, 110 అప్రోచ్ లను, బ్రేక్ ఓవర్ ఫీచర్లను కలిగిఉంది. టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్ తో పనిచేసే కొత్త వేడ్ ప్రోగ్రామ్ సపోర్ట్ దీనికి అదనపు ఆకర్షణ. డిఫెండర్ మోడల్ మనకు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తోంది. ఈ మోడళ్లలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (PHEV) పవర్ ట్రైన్ వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. ఇది EV ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. పెట్రోల్ లైనప్‌లో ఫోర్ సిలిండర్ P300, శక్తిమంతమైన సిక్స్ సిలిండర్ P400 మోడళ్లు ఉన్నాయి.
డిఫెండర్ కు లోపలిభాగంలో సెంట్రల్ ఫ్రంట్ జంప్ సీట్ ఆప్షన్ గా ఉంది. డాష్ మౌంటెడ్ గేర్ షిప్టర్ తో ఇది పనిచేయనుంది. పాత ల్యాండ్ రోవర్ మోడళ్ల మాదిరిగానే దీంట్లో వెనక వైపు రెండు వరుసల సీట్లు ఉంటాయి. డిఫెండర్ 110 మొత్తం ఐదు సీట్లు, లేదా ఆరు సీట్లు లేదా 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. డిఫెండర్ 90 మోడల్ కారులో ఆరుగురు కూర్చోవచ్చు. కొత్త డిఫెండర్ ను ఇంజనీరింగ్ సైన్-ఆఫ్ కోసం 62,000 కంటే ఎక్కువసార్లు పరీక్షించారు.
డిఫెండర్ కొత్త డిజైన్లలో ముందు భాగం చాలా చిన్నదిగా ఉంటుంది. దీనికి 4x4 రూఫ్‌తో ఆల్పైన్ లైట్ విండోస్‌ను అమ1ర్చారు. సైడ్-హింగ్డ్ రియర్ టెయిల్ గేట్, స్పేర్ వీల్ వంటివి పాత మోడళ్లలో మాదిరిగానే ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిఫెండర్ మొత్తం ఏడు కలర్లలో లభిస్తోంది. ఫ్యూజి వైట్, ఈగర్ గ్రే, సాంటోరిని బ్లాక్, ఇండస్ సిల్వర్, టాస్మాన్ బ్లూ, పాంగీయా గ్రీన్, గోండ్వానా స్టోన్ వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది.