చాలా మంది వ్యాపార నిమిత్తం సరుకులను చేరవేయడానికి అణువుగా ఉండేందుకు వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే ఆటో లేక మిని లారీ అనే ఆలోచనలో ఉంటారు.. లారీ కన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. ఆటో లలో ఏ ఆటో సౌకర్యంగా ఉంటుంది.. దాని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య ఆటో మొబైల్స్ కంపెనీలు వాహనాల పై సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు.. తాజాగా మరో కంపెనీ ఆటో కొనుగోలు పై భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..


వాహన తయారీ కంపెనీ పియాజియో తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఉన్న ఆటోను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 6 అడుగుల డెక్‌తో కూడిన డీజిల్ కార్గోను మార్కెట్‌ లోకి విడుదల చేసింది. దీని పేరు ఆపే ఎక్స్‌ట్రా ఎల్‌డీఎక్స్ ప్లస్‌. ఈ కొత్త ఆటోలో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఆపే ఎక్స్‌ట్రా ఎల్‌డీఎక్స్ ప్లస్ వెహికల్‌లో మంచి ఇంజిన్ ఉంటుంది. 599 సీసీ బీఎస్ 6 డీజిల్ ఇంజిన్ ఉంటుంది. కంపెనీ ఈ వెహికల్‌లో 5+1 గేర్ బాక్స్ అమర్చింది. అలాగే ఈ కార్గో ఆటో మంచి మైలేజ్‌ను కూడా అందిస్తుంది. దాంతో పాటుగా 30000 కిలో మీటర్ల మన్నికను కూడా ఇస్తుంది..


కస్టమర్‌కు కూడా మంచి రాబడి లభిస్తుంది. ఇకపోతే పియాజియో ఆపే ఎక్స్‌ట్రా ఎల్‌డీఎక్స్ ప్లస్ ధర రూ.2,65,615గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ పుణే ధర. 5.5 అడుగుల డెక్ కలిగిన కార్గో ఆటోతో పోలిస్తే దీని ధర రూ.2 వేలు మాత్రమే ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల కన్నా మెరుగైన ఫీచర్లతో కస్టమర్లకు అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన ప్రొడక్టులు అందించడంలో  ఎప్పుడు మరో అడుగు ముందుంటామని పియాజియో వెహికల్స్ చైర్మన్, ఎండీ డియాగో గ్రాఫీ తెలిపారు. ఈ కొత్త వెహికల్స్‌లో అధిక స్పేస్ కారణంగా కస్టమర్ల రాబడి పెరుగుతుందని పేర్కొన్నారు. ఇకపోతే ఈ వెహికల్ కొనుగోలు చేయాలని భావించే వారు దగ్గరిలోని పియాజియో షో రూమ్ లలో కొనుగోలు చేయవచ్చునని వెల్లడించారు. చుడాటనికి చిన్నగా ఉన్నా, పెద్ద బరువులు మోస్తున్న ఈ ఆటోకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: