
అసలు విషయానికొస్తే ఈ ఏడు ఆఫర్ల తో పాటుగా అదిరిపోయే రేటింగ్ ను అందుకున్న కార్లు మార్కెట్లో ఎవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మహీంద్రా థార్ :
అత్యంత సురక్షితమైన వాహనం, యుఎస్ వి స్పెషలిస్ట్ మహీంద్రా థార్ వయోజన సేఫ్టీ లో 4 స్టార్ రైటింగ్, పిలల్ల సేఫ్టీ రైటింగ్లో 4 స్టార్ రైటింగ్ లభించింది. కాంపాక్ట్ యూఎస్వి తరువాత క్రాష్ టెస్ట్ లో బెస్ట్ రిజల్ట్స్ పొందిన రెండవ మహేంద్ర మోడల్ ఇది. ఇందులో ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓపిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ లు మొదలగు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఈ కారుకు డిమాండ్ ఉంది..
టాటా టియాగో, టిగోర్ :
టాటా మోటార్స్ అందిస్తున్న టియాగో హెచ్ బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్లు 4స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందాయి. ఇది వయోజన రక్షణ లో 4 స్టార్ రేటింగ్, పిల్లల భద్రత విషయంలో 3 స్టార్ రేటింగ్ పొందాయి.. కారు స్పీడ్ తదితర అంశాలపై ఈ కారు టాప్ రేటింగ్ ను అందుకున్నాయి.ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్ మొదలగు సున్నిత అంశాలు ఈ కార్లకు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మార్కెట్ లో టాప్ ప్లేసులో నిలిచాయి..
టాటా ఆల్ట్రోజ్
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన, వయోజన రక్షణలో దీనికి 5 స్టార్ కి 5 స్టార్, పిల్లల సేఫ్టీరేటింగ్లో 3 స్టార్ రేటింగ్ పొందింది. సీటు సర్దుబాటు, వాయిస్ అలెర్ట్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని కారును డిజైన్ చేశారు.. దీంతో కారు మైలేజ్ మాట పక్కన పెట్టి ఫీచర్లు బాగుండటంతో కారు కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది..
వీటితో పాటుగా టాటా నెక్సాన్ , మహీంద్రా లోని కొన్ని కార్లు మంచి టాక్ ను అందుకున్నాయి.. దీంతో ఇప్పుడు టాక్ మాములుగా లేదని చెప్పాలి.. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న కార్లు ఇవే..