అయితే ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.. ఈ మేరకు బజాజ్ కూడా మరో కొత్త వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది..అయితే ఈ మోడల్‌ను కూడా జనాలు ఆదరిస్తున్నారు. బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ చేతక్‌ను ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. అయితే కరోనా వల్ల అన్ని వాహనాల విక్రయాలు ఆగిపోయాయి. ఈ కంపెనీ స్కూటర్లు వచ్చిన మొదట్లో మంచి డిమాండ్ ను పొందలేకపోయాయి.. అయితే ఈ బైక్ అన్నిటితో పోలిస్తే అమ్మకాలు కాస్త ఎక్కువ అనే చెప్పాలి..
నెలల కాలంలో ఏకంగా 800 ఎలక్ట్రిక్ చేతక్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఆ సంఖ్య తక్కువే కావచ్చు, కానీ ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోలిస్తే ఎక్కువే. ఎందుకంటే గత 3 నెలల కాలం లో టీవీఎస్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాను కేవలం 138 యూనిట్లనే విక్రయించింది. దీంతో బజాజ్ కు మంచి డిమాండ్ ఉందని తెలుస్తుంది.. 3 కిలోవాట్ల బ్యాటరీని అందించారు.. ఇంజిన్ 16ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.44 బీహెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. స్కూటర్ కు 4 గంటల లో ఛార్జింగ్ పెట్టవచ్చు.. నడిపిస్తే ఏకంగా 95 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మార్కెట్ లో ఈ స్కూటర్ ధర వచ్చేసి 1.15 లక్షలు ఉంటుంది..