ఇకపోతే గత నెలలో విడుదలైన బైకుల వలన కంపెనీ దేశీయ విక్రయాలు 53.66% వృద్ధి చెందగా , ఎగుమతులు 28.64% వృద్ధి సాధించాయి. నవంబర్ 2020 నెలలో పల్సర్125 సిసి వేరియంట్ అమ్మకాలు గణనీయంగా 56,549 యూనిట్లను విక్రయించగా, 2019 నవంబర్ నెలలో 50,193 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి..పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కంపెనీ సేల్స్ బాగా పెరిగాయని ఇటీవల కంపెనీ వెల్లడించింది.
ఈ ఏడాది ఈ కంపెనీ నుంచి వచ్చిన బైకులు వాటి విక్రయాల సంగతిని ఒకసారి పరిశీలిస్తే..బజాజ్ పల్సర్ 220ఎఫ్ 7114 యూనిట్ల విక్రయాలై,26% వృద్ధి రేటు ను సొంతం చేసుకుంది. ఇంకా పల్సర్ 160, పల్సర్ 180, పల్సర్ 200 వేరియంట్స్ విక్రయాల మొత్తం 10,522 యూనిట్లుగా నమోదై 24% వృద్ధిని సాధించాయి. 2020 నవంబర్ లో మార్కెట్ అన్నిరకాల ఇంజన్ ఆప్షన్లతో కూడిన పల్సర్ బ్రాండ్ అమ్మకాలు 1,04,904 అమ్ముడవ్వగా గత ఏడాది నవంబర్ 2019లో68,268 యూనిట్లను మాత్రమే అమ్మింది.. గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది 53.66 % ఎక్కువ వృద్ది రేటును పెంచి అధిక స్థాయిలో అమ్ముడు పోయిన కంపెనీ గా అరుదైన రికార్డులను అందుకుంది..