ఇండియా లో ఆటో మొబైల్ కంపెనీల కొత్త కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే పలు కంపెనీలు కార్లు, బైకుల ను విడుదల చేసారు.వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ప్రముఖ దిగ్గజ కంపెనీ టెస్లా కారును ఇండియా లో సందడి చేయబోతుంది.. త్వరలోనే ఈ ఖరీదైన కారు ఇండియాలో లాంఛ్ చేయనున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కారుగా ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. ఆ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 



ఎన్నో ఏళ్లుగా టెస్లా.. ఇండియాకు వస్తోందన్న వార్తలు ఉన్నా ఈసారి మాత్రం ఆ సంస్థ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ సంస్థ ఇండియాకు వస్తున్నట్లు ధృవీకరించారు. అంతేకాదు ఈ కార్లు కంప్లీట్‌లీ బిల్టప్ యూనిట్స్(సీబీయూ) రూపంలో వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా, ఈ కారును బెంగుళూరు లోని ప్రముఖ కంపెనీలు రిజిస్టర్ కూడా చేసుకుందని తెలుస్తుంది..



టెస్లా ఇండియాకు వస్తుందంటే ఏ మోడల్‌ను ముందుగా ఇక్కడ లాంచ్ చేస్తారో అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొన్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ కారు మోడల్ 3 ను లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీబీయూ రూపంలో ఇండియాకు వస్తున్న కారణంగా ఈ కార్లపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దీనివల్ల ఈ కార్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. మోడల్ 3 ధర సుమారు రూ.60 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టైల్ లుక్ తో పాటుగా అదిరిపోయే ఫీచర్లు ఉండటం తో ఈ కారును కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది.. ఒకసారి ఛార్జ్ చేస్తే 463 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు..అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: