
ఆటో కొన్న తర్వాత మూడేళ్ల వరకు వారెంటి ఉంటుంది.. అంతేకాదు లక్ష కిలో మీటర్లు వాడేంత వరకు గ్యారెంటీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వీటితో . 3 ఏళ్లు ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా లభిస్తుంది.పియాజియో ఐకనెక్ట్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది.కంపెనీ వీటిని ఎఫ్ఎక్స్ శ్రేణి కింద మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎఫ్ఎక్స్ అంటే ఫిక్స్‌డ్ బ్యాటరీ అని అర్థం. ఈ ఆటోలు ప్యాసింజర్, కార్గో ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త పియాజియో అప్పి ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్‌లో 9.5 కిలోవాట్ పవర్‌ట్రైన్ ఉంటుంది. ఫుల్లీ మెటల్ బాడీ వీటి ప్రత్యేకత...
ఆటోకు ఆరు అడుగుల బాడీ వస్తుంది. వీటిల్లో బ్లూవిజన్ హెడ్ ల్యాంప్స్, న్యూ బాడీ గ్రాఫిక్స్, కొత్త కలర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయెల్ టోన్ సీట్స్ ఇలా పలు రకాల ఫీచర్లు ఈ కొత్త ఆటోలలో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బూస్ట్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని వివరించింది..ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్ అనే కార్గో వెర్షన్ కొనుగోలు చేస్తే దీని ధర రూ.3.12 లక్షలుగా ఉంది. అదే ఈసిటీ ఎఫ్ఎక్స్ అనే ప్యాసింజర్ వెహికల్ కొనుగోలు చేస్తే ధర రూ.2.83 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు..