ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బీఎండబ్ల్యూ 340ఐ మోడల్ విడుదలైంది. 3సిరీస్‌లోని మోడలైన ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.62.90 లక్షలుగా నిర్ణయించారు. పరిమిత సంఖ్యలోనే ఈ కార్లను విక్రయించాలని బీఎండబ్ల్యూ నిర్ణయించింది. ఈ సరికొత్త మోడల్ 340ఐను దేశీయంగానే తయారు చేస్తోంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ను స్వీకరిస్తోంది. దీనికి లక్షరూపాయలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. తొలి 40 మంది కస్టమర్లకు రేస్‌ట్రాక్ డ్రైవర్ ట్రైనింగ్ శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ కారులో 3.0లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 387 బీహెచ్‌పీ శక్తి, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఆల్‌వీల్ డ్రైవ్ ఫీచర్ దీనికి ఉంది. 4.4 సెకన్లలో ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంటుంది. కారుకు 8స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ను అమర్చారు.ఇక కారులో ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ డాంపర్స్‌తో కూడిన ఎం సస్పెన్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. బీఎండబ్ల్యూ ఎం ఎక్స్‌డ్రైవ్ ఫీచర్ ఉంది. కారుకు సరికొత్త కిడ్ని గ్రిల్‌ను బిగించారు. 18 అంగుళాలా వీల్స్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ను అమర్చి మరింత ఆకర్షణ గా మార్చారు.. ఇక ఇంటీరియర్‌లో 3సిరీస్ సెడాన్‌లో ఉన్న ఫీచర్లు ఉన్నాయి. సన్‌రూఫ్, 12.3 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ కారు అందాన్ని మరింత పెంచాయి. 3జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వ్యవస్థ , యాంబియంట్ లైటింగ్ వంటివి అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి... ఈ కారు పేరు వినగానే బుకింగ్స్ అయిపోతున్నాయి అంటే కారు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు..