
ఈ బైక్‌పై ప్రయాణం మరిచిపోలేని అనుభూతి మిగులుస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 500సీసీ మోడల్ బైక్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సరైన ఆప్షన్ అవుతుందన్నారు.. అయితే,8 వాల్వ్ ట్విన్ సిలిండర్‌తోపాటు 471 సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్‌ను అమర్చింది హోండా మోటార్ సైకిల్స్. మొత్తం ఆరు గేర్లతో పని చేసే ఈ బైక్ ఇంజిన్ 8,500 ఆర్‌పీఎం వద్ద 47 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. ముందూ వెనుక ఏబీఎస్‌తో కూడిన డిస్క్ బ్రేక్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్ ఉంది. ఇది సడెన్ బ్రేక్ వేసినప్పుడు వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా ముందూ వెనుక లైట్లు ఆన్ అవుతాయి.
బైక్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాటీ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభించనుంది.హోండా సీబీ 500ఎక్స్ బైక్ తమ ప్రత్యర్థి సంస్థల బైనెల్లికి చెందిన టీఆర్‌కే 502, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, కవాసాకీ వెర్స్యేస్ 650, సుజుకి వీ-స్రోమ్ 650 ఎక్స్‌టీ బైక్‌లతో ఈ బైక్ పోటీ పడుతుందని అంటున్నారు..ఇంక ఆలస్యం ఎందుకు మీకు నచ్చినట్లయితే కొనేశయ్యండి..