కారు కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ బడ్జెట్ లో మంచి కార్లు కొనాలనుకుంటున్నారు.ఎటువంటి కార్లు కొంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.. పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యులు వాహనాలు కొనుగోలు చేయాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కారు కొనుగోలు చేయాలంటే మత్రం ధర చూసి ఆగుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసినా మైలేజీ విషయంలో వెనుకంజ వేస్తున్నారు.


ఈ రెండింటి బేరీజు వేసుకుని చూసుకుని మంచి ధరతో పాటు, అత్యుత్తమ మైలేజీనిచ్చే కార్ల కోసం చూస్తున్నారు. పది లక్షల లోపు మార్కెట్లో ఉన్న కార్లు ఇవే..


మారుతీ సుజుకీ సెలేరియో:


మారుతీ సుజుకీ కార్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.-ప్రెసో, వాగన్-ఆర్ మోడళ్లలో ఉన్న ఇంజిన్ నే ఇందులోనూ ఉపయోగించారు. పవర్ ఔట్ పుట్ కూడా ఆ కార్లలో మాదిరేగానే ఉంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. లీటరుకు గరిష్ఠంగా 21.63 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర 5.42 లక్షల వరకు ఉంటుంది.


రెనాల్ట్ క్విడ్:

బీఎస్4 ఇంజిన్ ను కలిగి ఉన్నప్పుడు రెనాల్ట్ క్విడ్ అత్యధికంగా మైలేజినిచ్చే కారుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే బీఎస్6కు మారిన తర్వాత మైలేజి కొద్దిగా తగ్గింది. 800సీసీ 1.0-లీటర్ గ్యూస్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 4.72 లక్షలుగా సంస్థ వెల్లడించింది.


డాట్సన్ రెడీ-గో:

డాట్సన్ రెడీ-గో. ఇది లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. అంతేకాకుండా 1.0-లీటర్ ఇంజిన్ ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూం ఈ సరికొత్త డాట్సన్ వాహనం ప్రారంభ ధర వచ్చేసి రూ.4.92 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.. మొత్తానికీ ఈ కారుకు ప్రత్యేకతలు కూడా ఎక్కువగానే ఉంటాయి.


వీటితో పాటుగా మారుతీ సుజుకీ వాగన్-ఆర్,మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో,మారుతీ సుజుకీ స్విఫ్ట్ వంటి కార్లు కూడా మార్కెట్లో పది లక్షల లోపు ధర తో అందుబాటులో ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: