
ఈ సరికొత్త బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ ఫుల్లీ ఎలక్ట్రిక్ 4 డోర్ గ్రాన్ కూపేగా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ విభిన్న వర్షన్లలో విడుదల కానుంది. దీని రేంజ్ 590 కిలోమీటర్ల (WLTP) వరకు ఉంటుందని అంచనా, అయితే ఈపీఏ వర్షన్ అయితే 300 మైళ్ల (482 కిలో మీటర్ల) వరకు ఉంటుందని తెలుస్తోంది. దీని పవర్ ఔట్ పుట్ 390 కిలోవాట్లు లేదా 530 హార్స్ పవర్ ను కలిగి ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది.
ఈ కంపెనీ 8 వర్షన్ గురించి కూడా వెల్లడించింది. సరికొత్త డ్యాష్ బోర్డు లేఅవుట్, విజువల్ డిజైన్ తో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. క్లాస్ డ్రైవింగ్ డైనిమిక్స్, జీరో లోకల్ ఎమిషన్స్ విడుదల చేసే ఈ వాహనం లుక్ పరంగా అదరగొడుతుందని ఈ సంస్థకు బోర్డు మేనేజ్మెంట్ సభ్యులు పీటర్ నోటా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లగ్జరీ కార్లతో వాహన ప్రియులను మనసు దోచుకున్న బీఎండబ్ల్యూ ఇక పై విద్యుత్ వాహనాల తోనూ ఆకట్టుకుంటుందని స్పష్టమవుతుంది. ఈ కొత్త కారుల ధర, మొదలగు విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.. అప్పుడే వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది..