
అయితే, పెట్రోల్ లేదా డీజిల్ వినియోగంతో నడిచే వాహనాల స్థానే విద్యుత్ వినియోగ వాహనాల కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం విద్యుత్ ఆధారిత వాహనాల వాడకాన్నే ప్రోత్సహిస్తున్నది. ప్రస్తుతం మొత్తం వాహనాల్లో ఒక శాతంలోపే ఉన్న విద్యుత్ వాహనాలు వచ్చే ఐదేండ్లలో ఐదు శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నారు.. వాతరణం కాలుష్యం కాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 66 శాతం మంది కస్టమర్లు విద్యుత్ వాహనాల కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని కారుదేఖో ఓఎంజీ సంస్థ నిర్వహించిన సర్వేలో నిర్ధారణైంది.
53 శాతం మంది గట్టిగా విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడానికి పట్టుదలగా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం 68 శాతం మంది విద్యుత్ వాహనాల వైపు మొగ్గుతున్నారు. విద్యుత్ వాహనాల వైపు మళ్లడం వల్ల 11 శాతం మంది స్మూత్‌గా డ్రైవ్ చేయడానికి వీలవుతుందని, ఆరు శాతం మంది మెయింటెనెన్స్ కు అయ్యే ఖర్చు తక్కువ అవుతుందని అంటున్నారు.గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. వాటిలో లో స్పీడ్ ఈ3డబ్ల్యూ వాహనాలు 58 శాతం, ఈ2డబ్ల్యూ వాహనాలు 40 శాతం ఉంటాయని కారు దేఖో ఓఎంజీ సంస్థ సర్వేలో తేలింది. విద్యుత్ వాహనాలను తయారు చేయడంలో విజయాన్ని సాధించారని రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు...రానున్న రోజుల్లో అన్నీ ఎలెక్ట్రానిక్ వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు..