అలా కానీ పక్షం లో అందు లోకి ఎలుకల గుంపు దూరి నాశనం చేస్తాయి. ఎక్కువ రోజులు కారును ఒకే దగ్గర పార్క్ చేసి ఉంచకూడదు. కారు లొని ముఖ్యమైన బ్రేక్ డిస్కులు, కాలిపర్లు వంటి భాగాలు తుప్పు పడతాయి. అందువల్ల కారును కనీసం వారానికి ఒకసారైనా నడపాలి. తుప్పుపట్టిన వాహనాల బ్రేకులు సరిగా పనిచేయవు. దీంతో పాటు ఒక రకమైన శబ్దం వస్తుంది. వాటిని మార్చాలంటే అదనంగా ఖర్చు అవుతుంది.
వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే కారును తరచుగా నడపాలి. వారానికి ఒకసారైనా డ్రైవ్ కు వెళ్లడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు సమయం లేకపోతే కారును స్టార్ట్ చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వారానికి ఒకసారి అయినా కారు ను శుభ్రం చేయాలి. పోర్టబుల్ వాక్యూం క్లీనర్ సాయం తో వాహనాల లోపల, సీట్ల పై పేరుకు పోయే దుమ్మును శుభ్రం చేయాలి. దీనివల్ల దుర్వాసన దూరమవుతుంది. వవర్ విండోలు, కారు ఏసీ, ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అన్నీ ఆన్ చేసి ఉంచాలి.ఇంజన్ లోపలి భాగాలను ఇంజన్ ఆయిల్ సంరక్షిస్తుంది. హెల్తీ ఇంజన్ కోసం ఆయిల్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. నిర్ణీత దూరం తిరిగిన తరువాత ఆయిల్‌ను తప్పనిసరిగా మార్చాలి.. కారు ను వారానికి ఒకసారైనా క్లీన్ చేయాలి..!. అప్పుడే కారు బాగుంటుంది..