ఇన్నోవా కంపెనీ కొత్త ఫీచర్ల తో అదిరిపొయె కారును భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ.16.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త ఇన్నోవా క్రిస్టా కొత్త ఎక్స్టీరియర్ డిజైన్‌తో లభిస్తుంది. హెడ్‌ల్యాంప్స్ వరకు ఉండే కొత్త ట్రాపెజోయిడల్ పియానో బ్లాక్ గ్రిల్, షార్పర్ ఫ్రంట్ బంపర్ డిజైన్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏడు ఎయిర్ బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్ల తో ఈ వాహనం సురక్షితమైన వాహనాల్లో ఒకటిగా పెరుగాంచింది..
ఈ కారు ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే సేఫ్ పార్కింగ్.. పార్కింగ్ చేసి సమయం కారుకు ఎటువంటి నష్టం వాటిల్ల కుండా ఫ్రంట్ క్లియరెన్స్ సోనార్ ఉంటుంది. ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభూతి ని ఇచ్చేలా సరికొత్త ఫీచర్ల తో ఈ కారును రూపొందించామని టొయోటా యాజమాన్యం పెర్కొంది. ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభూతిని ఇచ్చేలా సరికొత్త ఫీచర్లతో ఈ కారును రూపొందించామని టొయోటా యాజమాన్యం చెప్పుకొచ్చారు..
అప్‌గ్రేడ్ చేసిన ఇన్నోవా లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కనెక్ట్ అయ్యే స్మార్ట్ ప్లే కాస్ట్ టచ్‌స్క్రీన్ ఆడియోను పొందుపరిచారు. రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, లాస్ట్ పార్క్‌డ్ లొకేషన్ వంటి సరికొత్త వెహికిల్ కనెక్టివిటీ ఫీచర్లను వినియోగదారులు ఉపయొగించుకొవచ్చు.. ఇన్నోవా తాజా అవతార్ వినియోగదారుల ను ఆకట్టుకుంటుందని నవీన్ తెలిపారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్ల కు ఈ వాహనం సౌకర్యంగా ఉంటుంది. కుటుంబం తో లేదా వ్యాపార అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సాటిలేని భద్రత, సౌకర్యాన్ని కోరుకునే కస్టమర్లు క్రిస్టాను ఎంచుకోవచ్చు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎంపిఎవి జాబితాలో ఇన్నోవాను అగ్ర స్థానం లో నిలబెట్టిన కస్టమర్లకు టయోటా ధన్యవాదాలు తెలిపింది.. ఈ కారుకు సంబందించిన పూర్తీ వివరాలు ఇవే..