జపాన్ దేశానికి చెందిన దిగ్గజ కార్ల సంస్థ టొయోట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ అగ్రగామి కార్ల కంపెనీగా దూసుకుపోతుంది.ఇక టొయోట కార్లతో భారతీయ జనాలకు ఓ ప్రత్యేకమైన మంచి అనుబంధం ఉంది. అప్పట్లో టొయోట విక్రయించిన క్వాలిస్ ఎమ్‌పివి ద్వారా ఈ బ్రాండ్ మన దేశంలో చాలా పాపులరిటీ  దక్కించుకుంది. టొయోట ఇంజన్లు సుధీర్ఘకాలం మన్నుతాయనే భావన అందిరిలోనూ ఉంది. ఈ జపనీస్ బ్రాండ్ ఇప్పుడు భారత మార్కట్ కోసం ఓ చిన్న కారును విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది.


టొయోట మోటార్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లో ఓ కారు పేరును ట్రేడ్ మార్క్ చేసింది. ఆ పేరే 'ఆగ్య' (Agya). టొయోటా అనుబంధ సంస్థ అయిన డైహత్సు 2012 నుండి ఇండోనేషియాలో విక్రయిస్తున్న ఐలా (Ayla) కాంపాక్ట్ హాచ్‌బ్యాక్‌ను భారత్‌లో టొయోటా ఆగ్య పేరుతో అమ్మాలని టొయోట కంపెనీ ప్లాన్ చేస్తోంది. డైహత్సు అనేది టొయోట కంపెనీ చవక కార్ బ్రాండ్.డైహత్సు ఐలా అలాగే టొయోటా ఆగ్య కార్ల రెండింటి డిజైన్ ఇంచు మించు ఒకేలా ఉంటుందని సమాచారం. పెద్ద ఓపెనింగ్‌తో కూడిన హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, త్రిభుజాకారపు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, సన్నటి హెడ్‌ల్యాంప్‌లు ఇంకా అల్లాయ్ వీల్స్‌తో ఇది ఓవరాల్ కాంపాక్ట్ డిజైన్‌తో చేయబడింది.సంవత్సరం కిందట ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డైహత్సు ఆధారంగా ఈ కొత్త టొయోట ఆగ్య కారును తయారు చేసే అవకాశం ఉంది.


అక్కడి మార్కెట్లో ఇది 1.0జి, 1.2జి మరియు 1.2జి టిఆర్‌డితో సహా పలు ఇతర వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో 1.0జి మోడల్ 1.0 లీటర్ త్రీ సిలిండర్ వివిటి-ఐ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 67 బిహెచ్‌పి శక్తిని 89 ఎన్‌ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఇందులోని ఇతర వేరియంట్లు 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ డ్యూయల్ వివిటి-ఐ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 88 బిహెచ్‌పి పవర్‌ను ఇంకా 108 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ అలాగే ఫోర్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.ఇక త్వరలోనే భారత్ మార్కెట్ లోకి ఇది రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: