


ఇక ఒకవేళ హోండా తమ సిబి300ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, అది బ్రాండ్ యొక్క ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారానే అమ్మటం జరుగుతుందట.ఇక హోండా బిఎస్4 వెర్షన్‌లో వాడిన అదే ఇంజన్‌ను కంపెనీ బిఎస్6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనుంది. ఈ అప్‌గ్రేడెడ్ ఇంజన్ పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవట.ఇక బిఎస్ 4 మోటార్‌సైకిల్‌లో 286సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను వాడారు. ఈ ఇంజన్ ఎక్కువగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 31.4 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ 300సీసీ బైక్ ధర సుమారు రూ.2.41 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుందని అంచనా.