ఇక ఇసుజు మోటార్స్ ఇండియా తెలిపిన సమాచారం ప్రకారం చూసినట్లయితే మార్చి 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో వారంటీ ముగిసిన వాహనాల కోసం ఇప్పుడు ఈ వారంటీ వ్యవధిని జులై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది. ఇంకా అదేవిధంగా, మార్చి 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో పీరియాడిక్ సర్వీస్ గడువు ముగిసిన కార్లకు కూడా ఈ గడువు తేదీని జూలై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ వివరించడం జరిగింది.
ఇక ఇసుజు మోటార్స్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ బిఎస్ 6 డి-మాక్స్ రేంజ్ పికప్ ట్రక్కులను అలాగే కొత్త బిఎస్ 6 ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయడం జరిగింది.ఇసుజు డి-మ్యాక్స్ రేంజ్‌లో కంపెనీ హై-ల్యాండర్ అలాగే వి-క్రాస్ అనే రెండు వెర్షన్లను అమ్మటం జరుగుతుంది.హై-ల్యాండర్ ఒక స్టాండర్డ్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. దీనిని వ్యక్తిగత ప్రయోజనం కోసం లేదా వాణిజ్య ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. వి-క్రాస్ పికప్ ట్రక్కును మాత్రం ప్రీమియం లైఫ్‌స్టైల్ వాహనంగా ప్రవేశపెట్టారు.
ఇక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే రెండు పికప్ ట్రక్కులు కూడా ఒకేరకమైన బిఎస్ 6-కంప్లైంట్ 1.9-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ ఎక్కువగా 163 హెచ్‌పి పవర్‌ను ఇంకా అలాగే 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో హై-లాండర్ 6-స్పీడ్ మాన్యువల్ 2-వీల్ డ్రైవ్ సిస్టమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, వి-క్రాస్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, 2-వీల్ డ్రైవ్ ఇంకా 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.