దేశంలో ఎలక్ట్రిక్ బైక్స్ కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ కంపెనీ రివాల్ట్ ఇంటెలికార్ప్ అందిస్తున్న ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్ ధర భారీగా తగ్గింది. ఈ మోడల్‌పై ఇప్పుడు అదనంగా భారీగా రూ.28,200 మేర ధర తగ్గింది.

ఇక తాజా ధరల తగ్గింపు తరువాత రివాల్ట్ ఇంటెలికార్ప్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన రివాల్ట్ ఆర్‌వి400 బైక్ ధర రూ.90,799 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, ఈ కంపెనీ వారు అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌పై  ఇప్పటి దాకా ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు.


ఇదిలా ఉండగా , రివాల్ట్ ఇంటెలికార్ప్  ఆర్‌వి300 ఇంకా ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నామని కంపెనీ తెలిపింది. కస్టమర్లు జూన్ 18, 2021వ తేదీ అంటే ఇవాళ్టి నుండి ఈ బైక్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ రివాల్ట్ మోడళ్ల కోసం బుకింగ్ అమౌంట్‌ను వరుసగా రూ.7,199 ఇంకా రూ.7,999 గా నిర్ణయించారు.

ఇక రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.ఈ ఇ-బైక్ 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ మాక్సిమమ్ గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

ఇక రివాల్ట్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇక ఈ ఇ -బైక్ 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది పూర్తి చార్జ్‌పై ఎకో మోడ్‌లో 180 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ మాక్సిమం గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

ఇక ప్రస్తుతం రివాల్ట్ ఇ-బైక్స్ ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్ ఇంకా హైదరాబాద్ నగరాల్లో మాత్రమే లభిస్తున్నాయి. ఈ నగరాల్లో శుక్రవారం అంటే ఇవాళ్టి నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.ఇక గతంలో ఈ మోడళ్ల కోసం భారీ బుకింగ్స్ వచ్చిన నేపథ్యంలో కంపెనీ గత కొంత కొన్ని రోజులుగా ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను టెంపరరీగా నిలిపివేసిన సంగతి తెలిసినదే.


మరింత సమాచారం తెలుసుకోండి: