
ఇక నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే జావా మోటార్ బైక్స్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను 2022 మధ్య నాటికి మార్కెట్లో విడుదల చేయవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ రెట్రో-మోడ్రన్ బ్రాండ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్పత్తిని కంపెనీ ఇండియాలోనే చేసే అవకాశం ఉందట.ఇండియా మార్కెట్లో జావా ఎలక్ట్రిక్ మోటార్ బైక్ ధరను అందుబాటులో ఉంచేందుకు గానూ ఆ కంపెనీ దీని ప్రొడక్షన్ లో ఎక్కువ భాగం లోకలైజేషన్ చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక దీని డిజైన్‌ను కూడా కంపెనీ తమ ఐకానిక్ రెట్రో స్టైల్‌లోనే ఉంచే అవకాశం ఉందట.కాకపోతే దీన్ని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను జోడించనున్నారట.ఇక టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీ ఇంకా స్టాండర్డ్ నెక్సాన్ కార్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు అలాగే ఎలక్ట్రిక్ వెర్షన్ నెక్సాన్‌లో కంపెనీ బ్లూ కలర్ యాక్సెంట్‌లను జోడించినట్లుగా జావా కూడా తమ పెట్రోల్ పవర్డ్ ఇంకా ఎలక్ట్రిక్ పవర్డ్ మోటార్‌సైకిళ్ల మధ్య వ్యత్యాసాన్ని బాగా చూపేందుకు ఈ తరహా స్ట్రాటజీనే పాటించే అవకాశం ఉందట.