కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ కూడా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఈ ఆధునిక టెక్నాలజీ కి అలవాటు పడుతున్నారు. ఇక ప్రజల అభిరుచి ని దృష్టిలో పెట్టుకొని దిగ్గజ వాహన తయారీ సంస్థ లు కూడా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా వాహనాలను కూడా తయారు చేస్తూ మంచి లాభార్జన పొందుతున్నారు. ఇకపోతే వాహన తయారీ సంస్థలు కూడా ప్రతి ఏడాది కొత్త ఫీచర్స్ తో తమ వాహనాల మోడల్స్లో మార్పులు తీసుకొస్తూ వినియోగదారులకు అందిస్తూ ఉండడం గమనార్హం. మరో రెండు రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోతోంది కాబట్టి ఈ సంవత్సరం పొడవునా వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బజాజ్, యమహా, కేటీఎం,  టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన స్పోర్ట్స్ బైక్స్ ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి.

1. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200:
బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ పాత మోడల్ అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఈ బైక్ కోసం ఆరా తీశారట . అయితే అమ్మకాల విషయానికి వస్తే ఈ మోడల్ బైక్ పర్వాలేదని అనిపించుకుంది.200CC ఇంజిన్ సామర్ధ్యం తో  24.14bhp పవర్ అలాగే 18.7Nm టార్క్ కలిగి ఉన్న ఈ బైక్ భారత మార్కెట్లో  RS200 స్పోర్ట్స్ బైక్ ధర రూ.1.63 లక్షలకు అమ్ముడుపోయింది.

2. కేటీఎమ్ ఆర్ సి 125:
సరికొత్త ఫీచర్లు ,లేటెస్ట్ అప్డేట్స్, స్టైలిష్ లుక్ రివైజ్డ్ హార్డ్వేర్ కలిగి ఉన్న ఈ ఆర్ సి 125 స్పోర్ట్స్ బైక్ భారత మార్కెట్లో చాలా ఎక్కువగా అమ్ముడుపోయింది. ఇక ఈ సంవత్సరం ఎక్కువగా అమ్ముడు పోయిన స్పోర్ట్స్ బైక్ లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఇక భారత మార్కెట్లో ప్రస్తుతం దీని ధర రూ.1.82 లక్షలు.

3.యమహా వై జెడ్ ఎఫ్ R15 V4:
యమహా R15 ఇండియాలో లాంచ్ చేసిన రోజు నుండి ఇప్పటివరకూ  విపరీతమైన జనాదరణను పొందుతోంది. ప్రధానంగా యాక్సెసిబిలిటీ, స్పోర్టినెస్ సమపాల్లో కలిగిన ఈ బైక్ యువతను ఇట్టే ఆకట్టుకోవడం గమనార్హం. ఈ బైక్ ధర రూ.1.71 లక్షల నుంచి మనకు ప్రారంభమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: