భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) కంపెనీ కొత్త SUV 'మహీంద్రా ఎక్స్‌యువి700' (Mahindra XUV700) దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ కొత్త SUV కార్ 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను సొంతం చేసుకుంది.ఇక దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం.ఇక ప్రతి సంవత్సరం కూడా 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు' ప్రకటించడం అందరికి తెలిసిందే, ఈ సంవత్సరం కూడా అనేక కార్లు ఇందులో కనిపించించాయి. ఇందులోని ఎంజి మోటార్ కంపెనీ  ఎంజి ఆస్టర్, స్కోడా ఆక్టావియా, ఫోర్స్ గూర్ఖా ఇంకా మారుతి సుజుకి సెలెరియో, సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్, రెనాల్ట్ కిగర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంకా టాటా పంచ్ వంటి పోటీదారులపైన నెగ్గి మహీంద్రా ఎక్స్‌యువి700 కార్ ఇప్పుడు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి.


ఇక ఈ అవార్డు రేసులో మహీంద్రా ఎక్స్‌యువి700 SUV కార్ 101 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే అదే సమయంలో జర్మన్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ 89 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.అలాగే మూడవ స్థానంలో నిలిచిన టాటా పంచ్ మైక్రో SUV 71 పాయింట్లు స్కోర్ చేసింది.ఇక మహీంద్రా ఎక్స్‌యువి700 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గెలుచుకున్న సందర్భంగా మహీంద్రా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన 'వీజయ్ నక్రా' మాట్లాడుతూ.. ఇది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం అని అన్నారు. ఇక ఈ గౌరవం ప్రధానం చేసిన ICOTY 2022 కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మహీంద్రా కంపెనీ ఈ లేటెస్ట్ SUV అద్భుతమైన డైజిన్ ఇంకా నిర్మాణ నాణ్యత వల్ల ఈ గౌరవం దక్కింది అన్నారు. ఇది కంపెనీ కస్టమర్ల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: