టొయోటా కంపెనీ కూడా మారుతి సుజుకి మాదిరిగానే తమ గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో ఓ సిఎన్‌జి (CNG) వెర్షన్ ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, గ్లాంజా సిఎన్‌జి కన్నా ముందుగా బాలెనో సిఎన్‌జి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మారుతి సుజుకి కంపెనీ తమ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కార్లను ఎస్-సిఎన్‌జి (s-CNG) టెక్నాలజీతో అమ్ముతుండగా, ఇక టొయోటా కంపెనీ తమ సిఎన్‌జి కార్లను ఇ-సిఎన్‌జి (e-CNG) పేరుతో అమ్మనుంది.టొయోటా కంపెనీ ఇప్పటికే తమ 2022 గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ను మార్కెట్లో రిలీజ్ చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 6.39 లక్షల నుండి రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ల మధ్యలో అమ్ముడవుతున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త గ్లాంజా రూ.11,000 లతో బుక్ చేసుకోవచ్చు. ఇది ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో 5-స్పీడ్ మ్యాన్యువల్ ఇంకా అలాగే 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.


ఇక పెట్రోల్ వెర్షన్ గ్లాంజాలో 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్, డ్యూయల్‌జెట్, మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడినన ఇంజన్ ను వాడారు. ఈ ఇంజన్ మాక్సిమం 89 బిహెచ్‌పి శక్తిని ఇంకా 113 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, సిఎన్‌జి వెర్షన్ లోని ఇదే ఇంజన్ దాదాపు 76 బిహెచ్‌పిల శక్తిని ఇంకా అలాగే 98 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుందని ఆశించవచ్చు. కాకపోతే, ఈ సిఎన్‌జి వెర్షన్ గ్లాంజా కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది.ఇక పెట్రోల్ వెర్షన్ గ్లాంజా వచ్చేసి లీటరుకు 22 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ సర్టిఫై చేయగా, కొత్తగా రాబోయే సిఎన్‌జి కార్ మోడల్ అయితే కేజీకు సుమారు 30 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: