అయితే తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి బైక్ ధరలు ఇంకా పెరుగుతాయట. అవును ఇది నిజమే అండీ... దేశంలోనే అతి పెద్ద బైక్ తయారీ సంస్థలలో ఒకటైన హీరో మోటోకార్ప్ బైక్ ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో బైక్ మరియు స్కూటర్ మీద రూ. 2000 లు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే బైక్ మోడల్ ను బట్టి ధరలలో మార్పు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 5 నుండి అమలు లోకి వస్తాయని హీరో మోటో కార్ప్ సంస్థ తెలిపింది. అయితే ఇందుకు గల కారణాన్ని కూడా తెలపడం విశేషం. బైక్ లను తాయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
అయితే ఇది నిజముగా బైక్ ప్రియులకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఒకవేళ మీరలో ఎవరైనా హీరో బైక్ లను కొనాలి అనుకుంటే ఇప్పుడు ఉన్న ఈ కాస్త సమయంలో మీకు నచ్చిన బైక్ ను కొనుగోలు చేసి ధరల భారం నుండి మినహాయింపు పొందండి.