భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇంకా విక్రయాలలో అగ్రగామిగా ఉన్న దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors), రానున్న రోజుల్లో తన మార్కెట్ లీడర్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ప్లాన్ చూస్తోంది. ఇక ఇందులో భాగంగా, టాటా కంపెనీ వచ్చే ఏడాదిలో ఏకంగా 80,000 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొడ్యూస్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను అమ్ముతుంది. అవి టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ఇంకా అలాగే టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV). ఇక ఇవి కాకుండా, ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో, కంపెనీ టాటా టిగోర్ ఈవీ ఆధారిత టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ (Tata XPress-T EV)ని కూడా అమ్ముతుంది.ఇక రాయిటర్స్ మీడియా నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ వచ్చే సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వార్షిక ఉత్పత్తిని 80,000 యూనిట్లకు పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే అంతకు ముందు సవంత్సరంతో పోలిస్తే, కంపెనీ గత సంవత్సరం భారత మార్కెట్లో మొత్తం 19,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.



ఈ ఉత్పత్తి పెంపు గురించి వ్యాఖ్యానించేందుకు ఇండియాలో అతిపెద్ద వాహన తయారీ సంస్థలలో ఒకటైన టాటా మోటార్స్ నిరాకరించినప్పటికీ, టాటా ఈవీలకు సరఫరాకు మించిన డిమాండ్ ఉండటంతో ఈవీ అమ్మాకాలు చాలా వేగంగా పుంజుకుంటున్నాయని మాత్రం పేర్కొంది.ఇక ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు అనేది చాలా వేగంగా ఉండటంతో, దాదాపు దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడి మార్కెట్లో రిలీజ్ చేసేందుకు బాగా పోటీపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో, ఈవీ మార్కెట్లో పోటీ తారాస్థాయికి చేరుకునే లోపే, ఈ విభాగంలో తనదైన బ్రాండ్ ఇమేజ్‌ను రెడీ చేసుకోవాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. టాటా మోటార్స్ వచ్చే 2026 వ సంవత్సరం నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు గడచిన గడిచిన నెలలో ప్రకటించిన సంగతి తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి: