ఇండియాస్ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ 'టాటా అవిన్య' (Tata Avinya) ను లాంచ్ చేసింది. ఇక ఈ అధునాతన ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై మాక్సిమం 500 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. అవిన్య అనే పేరును టాటా మోటార్స్ సంస్కృత భాష నుండి సేకరించింది. ఇక ఈ పేరుకి అర్థం ఆవిష్కరణ అని టాటా కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ 3 వ జనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలలో (Gen 3 EV) భాగంగా కంపెనీ టాటా అవిన్య కాన్సెప్ట్‌ను పెర్ఫార్మ్ చేసింది.టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఈ అధునాతన ఎలక్ట్రిక్ కార్ అవిన్య, స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాల కోసం కంపెనీ తయారు చేసిన సరికొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా కలిగి ఉంటుంది. కొత్త Gen 3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటుకున్న ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ వాహనం 2025 వ సంవత్సరం నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే ఛాన్స్ అనేది ఉంది. ఈ కొత్త Gen 3 ఎలక్ట్రిక్ వాహనాలు కనీసం 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయని టాటా మోటార్స్ కంపెనీ పేర్కొంది.



ఇక టాటా అవిన్య మానవ కేంద్రీకృత వాహనం (human centric vehicle) అని టాటా కంపెనీ పేర్కొంది. ఇది 4.3 మీటర్ల పొడవును కలిగి ఉండి ఇంకా అలాగే బయటి వైపు నుండి చాలా మినిమలిస్టిక్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, టాటా అవిన్య ఎక్కువగా లోపలి భాగం నుండి డిజైన్ చేయబడిందని ఆ కంపెనీ పేర్కొంది. అంటే, దీని డిజైన్ ఇంకా అలాగే ఫీచర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంటీరియర్ లో కనిపిస్తాయి.అలాగే అవిన్య బయటి డిజైన్‌లో T-ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు అనేవి ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా ఉంటాయి.ఇది ఈ కాన్సెప్ట్ కారు ముందు భాగం అంతటా కూడా విస్తరించినట్లు ఉంటుంది. ఈ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ల అంచుల వద్ద సొగసైన ఎల్ఈడి హెడ్‌లైట్‌ల సెట్ కూడా కనిపిస్తుంది. టాటా అవిన్యలో భారీగా షేప్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఇంకా అలాగే వాహనం ముందు భాగంలో ఉండే పెద్ద బ్లాక్ ప్యానెల్‌లు ముందు డిజైన్‌ను బాగా డామినేట్ చేస్తాయి.అలాగే ఈ ప్యానెల్‌లో అనేక ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: