సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వేగంగా పెరుగుతోంది. మీరు కూడా ఇక కేవలం 70 వేల రూపాయల స్కూటర్‌ను 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకు ఈజీగా పొందవచ్చు.ఇక తెలుస్తున్న నివేదికల ప్రకారం.. వినియోగదారులు హోండా యాక్టివాతో సహా 5 ప్రత్యేక స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇక్కడ హోండా యాక్టివా స్కూటర్ 20 వేల రూపాయలకు లభిస్తుంది.అలాగే ఢిల్లీలో రిజిస్టర్ అయిన హోండా యాక్టివా స్టాండర్డ్ స్కూటర్ కేవలం 20 వేల రూపాయలకే మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ 2012 వ సంవత్సరానికి సంబంధించిన మోడల్. ఇక ఇప్పటి దాకా ఈ స్కూటర్ మొత్తం 23 వేల కిలోమీటర్లు నడిచింది. అలాగే ఇందులో 109 సిసి ఇంజన్ ఇంకా అలాగే డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అయితే ఇందులో ఏబీఎస్ సిస్టమ్ అనేది లేదు. బైక్ దేఖో అనే వెబ్‌సైట్‌లో ఈ బైక్‌ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.ఇక మీరు హోండా యాక్టివా బైక్ కి బదులుగా hero Maestroని కనుక కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు దానిని సెకండ్ హ్యాండ్ మార్కెట్ యాప్ OLX నుండి కూడా ఈజీగా కొనుగోలు చేయవచ్చు. ఇది నలుపు రంగులో ఇంకా ఎరుపు రంగులో కూడా వస్తుంది.



ఇక దీని ధర వచ్చేసి 30 వేల రూపాయలు. ఇది 2016 వ సంవత్సరానికి చెందిన మోడల్. ఇది ఢిల్లీలో రిజిస్టర్ చేయబడింది. ఈ స్కూటర్ ఇప్పటి దాకా 28 వేల కిలోమీటర్లు నడిచింది.అలాగే యమహా ఫాసినో డార్క్‌నైట్ ఎడిషన్ డార్క్ ఎడిషన్ బైక్ దేఖో అనే వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ చేయబడింది. ఇక దీని ధర వచ్చేసి రూ.25 వేలుగా ఉంది. ఇది 2015 వ సంవత్సరానికి చెందిన మోడల్ కాగా, ఇప్పటి దాకా ఈ బండి టోటల్ గా 13 వేల కిలోమీటర్లు నడిచింది. అలాగే దీనికి 113 cc ఇంజిన్ అనేది ఇవ్వబడింది. ఇది 7.2 bhp శక్తిని ఇంకా అలాగే 8.1 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేయగలదు.కాబట్టి సెకండ్ హ్యాండ్ స్కూటర్లు కొనాలనుకునేవారు ఈ వెబ్ సైట్ లలో సెలక్ట్ చేసుకొని స్కూటర్లని కొనుగోలు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: