ఇక జీప్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 3 వరుసల ఎస్‌యూవి మెరిడియన్ (Meridian) కార్ ను అధికారికంగా ఇండియాలో లాంచ్ చేసింది. జీప్ మెరిడియన్ SUV ఎక్స్-షోరూమ్ స్టార్టింగ్ ధర మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ వేరియంట్ రూ.29.90 లక్షలు. ఇంకా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 36.95 లక్షలు. ఈ పోటీ ధర వద్ద ఈ SUV కార్ ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుందని జీప్ ఇండియా విశ్వసిస్తోంది.ఇక కంపెనీ చాలా కాలం క్రితం జీప్ మెరిడియన్ SUVని బుకింగులు స్టార్ట్ చేసింది. ఈ SUV కార్ ని కొనుగోలు చేయాలనుకునే వారు జీప్ డీలర్‌షిప్ వద్ద లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 50,000 టోకెన్ డబ్బుని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.


ఇక దీని లుక్ అండ్ డిజైన్ విషయానికి వస్తే ముందువైపు, మెరిడియన్ డ్యుయల్-ఫంక్షన్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయమైన బంపర్ ఇంకా అలాగే LED ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌ అనేది ఉంటుంది.అలాగే సైడ్ ప్రొఫైల్‌కి వస్తే SUV బాడీ క్లాడింగ్ ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్‌కు ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ రూఫ్ రెయిల్‌లను పొందుతుంది. జీప్ కంపాస్ కంటే పెద్ద బ్యాక్ ఓవర్‌హ్యాండ్ అండ్ పెద్ద బ్యాక్ డోర్స్ అనేవి పొందుతుంది. వెనుక వైపున, SUV LED టెయిల్‌లైట్‌లు, వెనుక వైపర్ అండ్ వాషర్ ఇంకా అలాగే ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్‌ను పొందుతుంది. ఈ SUV కార్ కి 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ని కూడా ఇచ్చారు.ఇక ఈ జీప్ మెరిడియన్ 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. దీనిని కంపాస్ SUV కార్ లో కూడా అందించారు. ఈ ఇంజన్ మాక్సిమం 170 బిహెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ SUV కార్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ రెండింటినీ కూడా పొందుతుంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) ఇంకా అలాగే ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌లు 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేశారు. ఈ SUV కార్ లో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: