Citroen C3 : ఫేమస్ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) దేశీయ మార్కెట్లో తన 'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌' (Citroen C5 Aircross) తో అడుగుపెట్టి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ మరో కొత్త SUV ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV కార్ 'సిట్రోయెన్ సి3' (Citroen C3). ఈ కొత్త SUV కార్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమైనట్లు తెలిసింది.ఇక దీని గురించి మరింత సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం..ఇక సిట్రోయెన్ కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసే రెండవ మోడల్ 'సిట్రోయెన్ సి3' (Citroen C3). ఇది ఇప్పటికే చాలా సార్లు కూడా టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇప్పుడు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఇక లాంచ్ కూడా త్వరలోనే ఉంటుందని ఆశిస్తున్నారు. అంటే బహుశా ఇది 2022 జూన్ నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.



ఇక ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కంపెనీ ఈ అప్డేటెడ్ SUV car ని విడుదల చేయకముందే కొన్ని డీలర్‌షిప్‌లు బుకింగ్స్ ప్రారంభించాయి. అయితే అధికారిక బుకింగ్స్ అనేవి ఇంకా ప్రారంభం కాలేదు, త్వరలో అవి కూడా స్టార్ట్ అవుతాయి.భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఈ కొత్త SUV లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా అలాగే పరికరాలను కలిగి ఉంటుంది. ఇక ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం, ఇది డ్యూయల్ టోన్ రూఫ్ టాప్‌ ని కూడా కలిగి ఉందని స్పష్టమైంది.అలాగే సిట్రోయెన్ C3 ఆరెంజ్ కలర్ రూఫ్ టాప్‌ కలిగి మిగిలిన బాడీ మొత్తం వేరే కలర్ లో ఉంది. ఈ కంపెనీ భారతదేశంలో మొదటి సారిగా ఈ కలర్ లో ప్రవేశపెట్టడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: