ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కార్ అంటే అందరికీ బాగా పరిచయం ఉన్నది అంబాసిడరే. ఈ కార్ గతమెంతో ఘనమైనది. 1990ల దాకా ఈ కార్ కలిగి ఉండటం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్.కానీ.. కాలక్రమంలో కొత్త టెక్నాలజీలు ఇంకా కొత్త తరం కోసం వచ్చిన మోడ్రన్ కార్లతో కారు కనుమరుగైంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా పీఎం నుంచి డీఎం దాకా అందరికీ కూడా ఫేవరెట్ కారుగా నిలిచిన అంబాసిడర్ మళ్లీ ఒక్కసారిగా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు దీన్ని కొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి ప్లాన్ లు జరుగుతున్నాయి. హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (HMFCI) ఇంకా ఫ్రెంచ్ కార్ కంపెనీ ప్యుగోట్ దీని డిజైన్, ఇంజిన్‌పై పని చేస్తున్నాయి. హిందూస్థాన్ మోటార్స్ కు సంబంధించిన చెన్నై ప్లాంట్‌లో అంబాసిడర్ కొత్త మోడల్ కార్ తయారు చేయబడుతోంది.ఇక ఇది కొత్త అవతార్‌లో అంబి అని పిలువబడనుంది. ఇది రాబోయే రెండేళ్లలో దేశ వీధుల్లోకి రానున్నట్లు సమాచారం తెలుస్తోంది. దేశంలో ప్రైవేటు కంపెనీలు వచ్చిన తర్వాత అంబాసిడర్ కార్ మాయ తగ్గిపోయింది. చాలా సంవత్సరాల పాటు కేవలం ప్రభుత్వ కొనుగోళ్లతోనే మనుగడ సాగించింది. 2014 వ సంవత్సరంలో, హిందుస్థాన్ మోటార్స్ భారీ అప్పులతో పాటు డిమాండ్ లేమి కారణంగా అంబాసిడర్ తన ప్రొడక్షన్ ని నిలిపివేసింది.



HMFCI అనేది CK బిర్లా గ్రూప్‌కు చెందిన కంపెనీ. ఈ కంపెనీ కిందనే ఇక హిందుస్థాన్ మోటార్స్ పనిచేస్తోంది. అంబి అవతార్‌లో అంబాసిడర్‌ని తీసుకురావడానికి పని జరుగుతోందని HM డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించడం జరిగింది. ఇక కొత్త ఇంజన్ కోసం మెకానికల్ ఇంకా అలాగే డిజైన్ వర్క్ అధునాతన దశకు చేరుకుంది. మిత్సుబిషి కార్లు ఒకప్పుడు HM చెన్నై ప్లాంట్ లోనే ప్రొడక్షన్ ని చేశారు.చెన్నై ప్లాంట్ నుండి చివరిగా అంబాసిడర్ కారు 2014 వ సంవత్సరంలో ఉత్పత్తి అయింది. 2014లో.. దేశంలోని ప్రాచీన కార్ కంపెనీ HM భారీ అప్పులు ఇంకా అలాగే డిమాండ్ లేమి కారణంగా అంబాసిడర్ ప్రొడక్షన్ ని నిలిపివేసింది. HM హానర్ CK బిర్లా గ్రూప్ ఈ కారు బ్రాండ్‌ను 2017 వ సంవత్సరంలో ఫ్రెంచ్ కంపెనీకి కేవలం రూ. 80 కోట్లకు విక్రయించింది.ఇక ప్యుగోట్ మన దేశ మార్కెట్ లోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉంది. అలాగే 1990ల మధ్యలో కంపెనీ భారత్ లోకి ప్రవేశించింది. ఇక మన దేశంలోకి మెుదట్లో వచ్చిన విదేశీ కార్ల కంపెనీల్లో ఈ కార్ కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: