ఇక దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ భారత మార్కెట్లో తమ సిఎన్‌జి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకోవాలని కూడా చూస్తోంది.ఈ ఏడాది ఆరంభంలో టియాగో ఇంకా టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లను ప్రవేశపెట్టిన టాటా, ఇప్పుడు తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ లో కూడా ఓ సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఇందులో భాగంగానే కంపెనీ టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా కూడా పరీక్షిస్తోంది.ఇంకా తాజాగా, టెస్టింగ్ దశలో ఉన్న టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి  కెమెరాకు చిక్కింది. టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్  సిఎన్‌జి వెర్షన్ భారతదేశంలో ఉద్గార పరీక్ష పరికరాలతో పరీక్షించబడుతోంది.ఇక మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో ఇది ముంబై వీధులలో టెస్టింగ్ చేయబడుతోంది. సాధారణంగా టెస్టింగ్ చేయబడే పలు వాహనాలను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేస్తారు. అలాంటిది, ఈ ఆల్ట్రోజ్ సిఎన్‌జి వేరియంట్‌పై ఎలాంటి క్యామోఫ్లేజ్ కూడా లేదు. ఇక దీన్నిబట్టి చూస్తుంటే, ఇది త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.టాటా మోటార్స్ ఇప్పటికే తమ టియాగో ఇంకా టిగోర్ మోడళ్లలో ఐసిఎన్‌జి (iCNG) టెక్నాలజీని ఉపయోగిస్తోంది.


అలాగే ఆల్ట్రోజ్ కూడా అదే పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది కాబ్టటి, ఇందులో సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టడం అనేది పెద్ద ఖర్చుతో కూడున్న పనేమి కాదు. ప్రస్తుతం, భారతదేశంలో డీజిల్ కార్ల వినియోగం తగ్గుముఖం పట్టడంతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వినియోగదారులు సిఎన్‌జి వాహనాల కోసం పరుగులు తీస్తున్నారు. పవర్ తగ్గినా పర్లేదు, కానీ మైలేజ్ పెరుగుతుందనే భావనతో వీటిని కొనేవారి సంఖ్య పెరుగుతోంది.టాటా మోటార్స్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, కంపెనీ విక్రయిస్తున్న టియాగో ఇంకా టిగోర్ మోడళ్లలో దాదాపు సగానికిపై డిమాండ్ వాటి సిఎన్‌జి వేరియంట్ల నుండే వస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఆల్ట్రోజ్ సిఎన్‌జి కార్ కూడా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి విడుదలతో, టాటా మోటార్స్ భారతదేశంలో పెరుగుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన మార్కెట్ వాటాను మరింత విస్తరించుకోవడానికి కూడా ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: