ఇండియాలో టాప్ లో దూసుకుపోతున్న ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ టూర్ ఎస్  లోని ఎయిర్‌బ్యా సిస్టమ్‌లో సమస్య కారణంగా వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.మారుతి సుజుకి డిజైర్  కమర్షియల్ టాక్సీ వెర్షనే ఈ డిజైర్ టూర్ ఎస్. ఇది ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండదు, కేవలం ఫ్లీట్ ఆపరేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారులోని ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌లో లోపాలున్నట్టు గుర్తించామని, అందుకే వాటిని వెనక్కు పిలిస్తున్నామని మారుతి సుజుకి తెలిపింది.మారుతి సుజుకి ఇండియా లేటెస్ట్ రీకాల్‌లో మొత్తం 166 డిజైర్ టూర్ ఎస్ కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగస్టు 6, 2022 నుంచి ఆగస్టు 16, 2022 మధ్యలో తయారు చేసి, అమ్మబడినట్లుగా కంపెనీ గుర్తించింది. రీకాల్‌కు వర్తించే వాహనాలను మారుతి సుజుకి గుర్తించి, సదరు వాహన యజమానులకు సమాచారం అందిస్తుంది. ఈ రీకాల్ కు ప్రభావితమయ్యే వాహనాలలో కంపెనీ ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను ఉచితంగా రీప్లేస్ చేయనుంది. ఇందుకోసం వాహన యజమానులు తమ కారును మారుతి సుజుకి  సర్వీస్ సెంటరుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.


ఒకవేళ ఎవరైనా తమ వాహనం ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తామే స్వయంగా తెలుసుకోవాలనుకుంటే, మారుతి సుజుకి ఇండియా  అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించి, అక్కడ కనిపించే 'Imp customer Info' అనే ట్యాబ్ పై క్లిక్ చేసి, తమ వాహనానికి సంబంధించిన ఛాసిస్ నెంబర్ ను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. యజమానులు తమ వెహికల్ ఛాసిస్ నెంబరును వాహనం  విండ్‌షీల్డ్ పై కానీ, ఒరిజినల్ ఇన్వాయిస్ పై కానీ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పై కానీ చూడవచ్చు.ఆగస్టు 6, 2022 నుంచి ఆగస్టు 16, 2022 మధ్యలో తయారు చేసిన మొత్తం 166 డిజైర్ టూర్ ఎస్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌కు సంబంధించిన సమస్యను గుర్తించినట్లు మారుతి సుజుకి స్టాక్ ఎక్స్చేంజ్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సమస్య వలన అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌బ్యాగ్‌ల తెరచుకోవడం విఫలమయ్యే అవకాశం ఉందని, కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రీకాల్‌ను ప్రకటిస్తున్నామని మారుతీ సుజుకి కంపెనీ వివరించింది.ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని మారుతీ కంపెనీ తన అధికారిక నోటిఫికేషన్‌లో సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: