వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ కార్ ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ 'ఫెరారీ' తన మొట్ట మొదటి 6 సిలిండర్ స్పోర్ట్స్‌కార్ అయిన 'ఫెరారీ 296 జిటిబి' (Ferrari 296 GTB) రిలీజ్ చేసింది.ఈ కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ ధర అక్షరాలా రూ. 5.40 కోట్లు (ఎక్స్-షోరూమ్).కంపెనీ ఈ కొత్త ఫెరారీ 296 GTB ని గత సంత్సరం జూన్‌లో ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు అధికారికంగా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.ఇక ఫెరారీ కార్లు అంటేనే ముందుగా గుర్తొచ్చేది అద్భుతమైన వాటి డిజైన్, కావున కొత్త ఫెరారీ 296 జిటిబి సూపర్ కారు మంచి ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కార్టు ఇప్పుడు తక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. అయితే డిజైన్ దాదాపు దాని ఫెరారీ 250 LM లాగానే ఉంటుంది.మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్‌లో మొదటిసారిగా, ఫెరారీ యాక్టివ్ స్పాయిలర్‌ను కూడా ఉపయోగించింది. ఇది మరింత ఆకర్షణను తీసుకువస్తుంది. ఈ కొత్త మోడల్  హెడ్‌లైట్ స్టైల్ 'టియర్‌డ్రాప్' ఆకారంలో ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది.


ఇందులోని గేర్‌షిఫ్ట్ సెలెక్టర్ ఫెరారీ క్లాసిక్ 'H-గేట్' డిజైన్‌కు నివాళిగా రూపొందించబడింది.ఫెరారీ 296 GTB  పరిమాణం కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సూపర్ కారు  పొడవు 4,565 మిమీ, వెడల్పు 1,958 మిమీ, ఎత్తు 1,187 మిమీ మరియు వీల్ బేస్ 2600 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపలి భాగంలో ఎక్కువ భాగం డ్యూయల్-టోన్ ఫినిషింగ్ లో ఉంటుంది (బ్లాక్ అండ్ రెడ్). అదే సమయంలో ఇందులోని ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి మంచి పట్టును అందించే విధంగా ఉంది. ఈ స్టీరింగ్ రెడ్ స్టిచ్చింగ్ కూడా పొందుతుంది. సీట్లు కూడా రెడ్ ఇంకా బ్లాక్ థీమ్ లో ఉంటాయి. మొత్తం మీద ఇది మంచి ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: