ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రోజురోజుకి అభివృద్ధివైపు అడుగులు వేస్తూనే ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను విడుదల చేస్తున్నాయి.అయితే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే హీరో మోటోకార్ప్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేసి ఆ విభాగంలో మంచి పురోగతిని పొందుతున్నాయి.ఇప్పుడు భారతీయ విఫణిలో జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హోప్' (HOP) ఎలక్ట్రిక్ తన కొత్త 'ఓక్సో' (OXO) ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టిన 'హోప్ ఓక్సో' (HOP OXO) బైక్ ప్రారంభ ధర రూ. 1,24,999 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి హోప్ ఓక్సో (HOP OXO) ఇంకా హోప్ ఓక్సో ఎక్స్ (HOP OXO X). హోప్ ఓక్సో ధర రూ. 1,24,999 కాగా, హోప్ ఓక్సో ఎక్స్ ధర రూ. 1,39,999. ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్ లో లేదా సమీపంలో ఉండే కంపెనీ ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.


డెలివరీలు వచ్చే నెల (ఆక్టోబర్) నుంచి ప్రారంభమవుతాయి.కొత్త HOP OXO ఎలక్ట్రిక్ బైక్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. అదే సమయంలో రైడర్స్ మెచ్చే అన్ని ఆధునిక ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ ఇంకా అలాగే సింగిల్ పీస్ సీట్ మొదలైన వాటిని పొందుతుంది.ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి OXO యాప్ ద్వారా స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ యాక్సెన్స్ చేయవచ్చు. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.Hop OXO ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి రెడ్ అండ్ బ్లూ కలర్. కాగా Hop OXO X కూడా రెండు కలర్స్ ఆప్సన్స్ పొందుతుంది. అవి గ్రీన్ మరియు గ్రే కలర్స్. హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఈ బైక్ 2,100 మిమీ పొడవు, 793 మిమీ వెడల్పు మరియు 1,085 మిమీ ఎత్తు ఇంకా 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: