ఫేమస్  స్వీడన్‌ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ వోల్వో  ఇప్పటికే భారతీయ మార్కెట్లో తన కొత్త 'ఎక్స్‌సి40 రీచార్జ్' SUV విడుదల చేసింది.అయితే ఇప్పుడు 'వోల్వో కార్ ఇండియా' ఇండియాలో అసెంబుల్ చేయబడిన ఈ వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV  మొదటి యూనిట్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది, కావున దీని ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ ఇప్పటికే తెలిపింది.ఎక్స్‌సి40 రీచార్జ్ అనేది భారతదేశంలో విడుదలైన వోల్వో బ్రాండ్‌  మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడం జరిగింది.వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అద్భుతమైన డిజైన్ ఇంకా ఫీచర్స్ పొందుతుంది. ఇది చూడటానికి దాదాపుగా పెట్రోల్/డీజిల్ మోడళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ SUV కావున కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.


అందువల్ల ఇందులో పెద్ద వోల్వో బ్యాడ్జ్, వైట్-ఫినిష్డ్ గ్రిల్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, బ్లాక్ స్టోన్ రూఫ్ ఇంకా డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కవర్ ఇంకా 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 13-స్పీకర్ హార్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ కూడా ఉన్నాయి.వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను పొందుతుంది. ఇందులో ఒక్కొక్క యాక్సిల్ పై ఒక్కొక ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇందులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్ ఇంకా అలాగే 660 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: