ఇండియన్   మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో బాగా ప్రజాదరణ పొందుతున్న ఫేమస్  వాహన తయారీ కంపెనీ 'మారుతి సుజుకి'  గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎప్పటికప్పుడు మార్కెట్లో తన ఫోర్డ్ పోలియోను విస్తరిస్తూనే ఉంది. ఈ తరుణంలోనే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తోంది.ఇందులో భాగంగానే మారుతి సుజుకి ఇటీవల తన కొత్త 'ఎక్స్ఎల్6' (XL6) cng వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త ఎక్స్ఎల్6 cng వేరియంట్ దాని మునుపటి పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. అంటే పెట్రోల్ వేరియంట్ కంటే కూడా XL6 cng వేరియంట్ ధర రూ. 95,000 ఎక్కువ అని అర్థమవుతోంది.అయితే ఈ కొత్త cng వేరియంట్ కొనాలనుకునేవారు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసాడు. ఇది రూ. 30,821 నుండి ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులకు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది.'మారుతి సుజుకి ఎక్స్ఎల్6 CNG' ధర రూ. 12.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).


ఈ వేరియంట్ ప్రస్తుతం ఒకే వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అది ఎంట్రీ-లెవల్ 'జీటా' వేరియంట్.కొత్త ఎక్స్ఎల్6 cng ఇప్పుడు ఎక్కువ మైలేజ్ అందించే విధంగా రూపొందించబడింది. కావున ఇది తప్పకుండా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.ఇక ఈ కొత్త cng వేరియంట్  డిజైన్ ఇంకా ఇంటీరియర్ ఫీచర్స్ లో ఎటువంటి మార్పులు లేదు. కొత్త ఎక్స్ఎల్6 cng వేరియంట్   బూట్ స్పేస్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 60 లీటర్ల cng ట్యాంక్ ఉంటుంది. ఈ కారణంగానే ఇందులో బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుంది.మారుతి సుజుకి XL6 S-CNG అదే 1.5 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 4-సిలిండర్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇక cng వేరియంట్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 87 బిహెచ్‌పి పవర్ ఇంకా 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 121.5 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 26.32 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: