టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి కార్ చాలా వరకు దాని పాత మోడల్ కార్ ని గుర్తుకు తెస్తుంది. అయితే ఇందులో చుట్టూ బ్లాక్ బాడీ క్లాడింగ్, ముందు ఇంకా వెనుక కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ రూఫ్, రూఫ్ రెయిల్‌లు, ఫాగ్ లైట్లు, టెయిల్ గేట్‌పై ప్లాస్టిక్ క్లాడింగ్ ఇంకా అలాగే డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.టాటా కంపెనీ  అన్ని ఇతర కార్ల లాగానే ఇది కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. అందువల్ల ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ఇంకా స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అయితే ఇందులోని cng ట్యాంక్ వల్ల బూట్ స్పేస్ అనేది కొంత తక్కువగా ఉంటుంది.టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జిలో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం కంట్రోలర్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టమ్ ఇంకా హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి.


ఈ ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.ఈ టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి 1.2 లీటర్ త్రీ సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్‌ ని కలిగి ఉంటుంది.ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 72 బిహెచ్‌పి పవర్ ఇంకా 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది.ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే ఇది 26.4 కిమీ/కేజీ మైలేజ్ ని అందిస్తుంది.ఇది క్లౌడీ గ్రే, పోలార్ వైట్, ఫైర్ రెడ్ ఇంకా ఫారెస్టా గ్రీన్ కలర్స్  లో అందుబాటులో ఉంటుంది.ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XT ఇంకా XZ. ఇందులో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి XT వేరియంట్ ధర రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి XZ వేరియంట్ ధర రూ. 7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా రూ. 90,000 ఎక్కువ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: