ఇక ఈ న్యూ ఇయర్ నుంచి  ఇండియన్ మార్కెట్లో అనేక అప్డేటెడ్ కార్లు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే హ్యుందాయ్ కంపెనీ ఈ రోజు తన 'ఆరా' (Aura) కార్ ని ఫేస్‌లిఫ్ట్‌ రిలీజ్ చేసింది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ. 6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, cng SX వేరియంట్ ధర వచ్చేసి రూ. 8.47 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ కోసం బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అందుకే ఈ హ్యుందాయ్ కారు కొనాలనుకునే వారు మొత్తం రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి.హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ మంచి అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ ముందు భాగంలో కొత్త ఫ్రంట్-ఎండ్ డిజైన్‌ ని చూడవచ్చు.ఇందులో బ్లాక్ కలర్ గ్రిల్ అనేది ఉంటుంది. ఇంకా అంతే కాకుండా ఈ కారులో ఇన్వర్టెడ్ ఎల్ షేప్ LED DRL బంపర్ చివర్లలో అమర్చబడి ఉంటాయి. అలాగే ముందు భాగంలో బ్రాండ్ లోగో కూడా ఉంది. ఇంకా దీని సైడ్ ప్రొఫైల్ లో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.


వెనుక భాగంలో పాత మోడల్ లాగా ఉండే అదే LED టెయిల్ లైట్స్ కూడా చూడవచ్చు.ఇక కొత్త ఆరా ఫేస్‌లిఫ్ట్ అప్డేటెడ్ డిజైన్ పొందిన  రియర్ ప్రొఫైల్ మాత్రం పాత మోడల్ లాగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఆరా బేస్ ట్రిమ్ తప్పా మిగిలిన అన్ని వేరియంట్స్ లో బూట్ లిడ్ స్పాయిలర్ అనేది ఉంటుంది. ఈ కొత్త ఆరా ఫేస్‌లిఫ్ట్ కార్ మొత్తం ఐదు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి E, S, SX, SX(O) ఇంకా SX+ వేరియంట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు దాని పాత మోడల్ కంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటాయి.ఇక అలాగే ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కూడా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా అలాగే ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అంతే కాకుండా ఈ కార్ లో 3.5 ఇంచెస్ MID కూడా ఉంటుంది. ఈ కార్ లో రియర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా అలాగే వైర్‌లెస్ ఛార్జర్‌ వంటివి కూడా ఉన్నాయి. అలాగే టాప్ వేరియంట్స్ లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ వంటివి కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: