ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది.ఇండియాలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల కంటే ముఖ్యంగా  ఎలక్ట్రిక్ స్కూటర్ లు, బైక్ లను రిలీజ్ చేస్తున్నాయి.దీంతో ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎక్కువైపోతాయి. ఇక ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల ఈవీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ముఖ్యంగా ఇండియాలో స్కూటర్ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్ ఎప్పుడు వస్తుందో? అని వినియోగదారులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్య కంపెనీ యాక్టివాలో కొత్త వెర్షన్ ను రిలీజ్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రియులు ఇక నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ వార్తలపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ ఇంకా సీఈఓ అయిన అట్ సుషి ఒగాటా స్పందించారు.హోండా కంపెనీ తన యాక్టివా వెర్షన్ లో కొత్త మోడల్ ను విడుదల చేసిందని, ఇది రాబోయే కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఆయన తెలిపారు.


 అయితే ఈవీ యాక్టివాను వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన యాక్టివాతో మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో తన ప్లేస్ ని టాప్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 56 శాతం మార్కెట్ వాటాతో స్కూటర్ సెగ్మెంట్ లో కంపెనీ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఈ బైక్ తో గ్రామీణ ఇంకా సెమీ అర్బన్ మార్కెట్ లో పట్టు నిలుపుకోవాలని కూడా ప్రయత్నిస్తుంది. అయితే 2024 వ సంవత్సరంలో మాత్రం కంపెనీ కొత్త ఈవీ యాక్టివాను రిలీజ్ చేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది మొదట్లో ఫిక్స్ బ్యాటరీతో స్కూటర్ ను విడుదల చేసి, రెండో మోడల్ లో బ్యాటరీ రీప్లేస్ మెంట్ ఫీచర్ ను కూడా తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఆయన కామెంట్స్ ని బట్టి యాక్టివా లో ఈవీ వెర్షన్ కచ్చితంగా సంవత్సరం తరువాత వస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: