ఈ న్యూ ఇయర్ నుంచి బిఎండబ్ల్యు ఇండియన్ మార్కెట్లో కొత్త కొత్త వాహనాలను  విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు bmw కంపెనీ తన కొత్త X1 స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ ని విడుదల చేసింది.కంపెనీ రిలీజ్ చేసిన ఈ కొత్త X1 కార్ డీజిల్ ఇంకా పెట్రోల్ వేరియంట్లలో విడుదల అయ్యింది. ఈ కార్ ధరల విషయానికి వస్తే, bmw X1 sDrive18i xLine (పెట్రోల్) ధర రూ. 45.90 లక్షలు , ఇక bmw X1 sDrive18d M Sport (డీజిల్) ధర వచ్చేసి రూ. 47.90 లక్షలుగా ఉంది.BMW కంపెనీ ఈ కొత్త కారు బుకింగ్స్ ని కూడా ప్రారంభించింది. ఇక డీజిల్ వేరియంట్ డెలివరీలు మార్చి నెల నుంచి పెట్రోల్ వేరియంట్స్ జూన్ నుంచి ప్రారంభమవుతాయి.ఇండియన్ మార్కెట్లో విడుదలైన మూడవ తరం bmw X1 దాని పాత మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే దీని ముందు భాగంలో గ్రిల్ కొంత పెద్దదిగా ఉంటుంది. బంపర్ బ్రష్డ్ సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా ఈ కార్ లో అట్రాక్టివ్ హెడ్‌ల్యాంప్‌, ఇన్‌వర్టెడ్ ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌, 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ ఇంకా అలాగే వెనుక LED టెయిల్ ల్యాంప్‌ వంటివి కూడా ఉంటాయి.


కార్ ఇంటీరియర్ డిజైన్ ఇంకా అలాగే ఫీచర్స్ విషయానికి వస్తే.. bmw X1 ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.అలాగే ఇందులో అప్డేటెడ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే అనేది చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్‌లు ఇంకా అలాగే కొన్ని ఫిజికల్ బటన్స్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌ ని కూడా చూడవచ్చు. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్ల దాకా ఉంటుంది. మొత్తం మీద ఈ కార్ ఇంటీరియర్ చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా 10.70 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అలాగే 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్ ఇంకా అలాగే ADAS టెక్నాలజీ అనేది ఉంటుంది. ఇంకా వీటితో పాటు LED హెడ్‌లైట్లు, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఆపరేషన్ ఇంకా పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ ని కూడా ఇందులో పొందవచ్చు. ఫీచర్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: