ఇండియాలో సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్కు బెస్ట్ సెల్లింగ్ మోడల్గా 'క్రేటా' SUV కార్ కొనసాగుతోంది.ఇండియాలో ప్రస్తుతం ఈవీ మార్కెట్కు డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. కొత్త మోడల్స్ను లాంచ్ చేసేందుకు హ్యుందాయ్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు క్రేటాకు ఎలక్ట్రిక్ వర్షెన్ను తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ వెహికిల్ ఇండియా రోడ్ల మీద మొదటి సారి దర్శనమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కోనా ఎలక్ట్రిక్లోని మోటార్నే ఈ క్రేటాలోనూ వాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో అంచనాలనేవి ఉన్నాయి. 2025 వ సంవత్సరంలో ఈ హ్యుందాయ్ క్రేటా ఈవీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ ఓవరాల్ డిజైన్.. ఐసీఈ ఇంజిన్ను లాగా ఉండొచ్చు.


పెద్ద బానెట్, గ్లాస్ బ్లాక్ గ్రిల్, ట్రై బీమ్ ఎల్ఈడీ హెడ్లైట్స్, బ్లాక్డ్ ఔట్ బీ పిల్లర్స్, రూఫ్ రెయిల్స్ ఇంకా స్కిడ్ ప్లేట్స్, డిజైనర్ అలాయ్ వీల్స్, స్ప్లిట్ టైప్ ఎల్ఈడీ టెయిల్లైట్స్ ఇంకా అలాగే రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి ఫీచర్స్ ఈ ఈవీ ఎక్స్టీరియర్లో ఉండొచ్చు.క్రేటా ఈవీకి సంబంధిచిన టెక్నికల్ డీటైల్స్ అనేవి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే.. కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఉపయోగిస్తున్న 39.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఇందూలో కూడా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే ఈ ఈవీ ఇంటీరియర్ కూడా క్రేటా ఐసీఈ ఇంజిన్ లాగా ఉంటుంది. ఇందులో ప్రీమియం అప్హోలిస్ట్రీ, ఎలక్ట్రిక్ సన్రూఫ్, వయర్లెస్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ రేర్ ఏసీ వెంట్స్, మల్టీఫంక్షనల్ స్ట్రీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.24 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటి ఫీచర్స్ ఈ హ్యుందాయ్ క్రేటా ఈవీలో ఉండే ఛాన్స్ ఉంది.ఇంకా అలాగే ఈ కార్ సేఫ్టీ విషయానికొస్తే.. ఈ కార్ లో 6 ఎయిర్బ్యాగ్స్, ఇంకా ఈఎస్సీ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: