అధిక పెట్రోల్ ధరలతో ఎంతగానో సతమతం అవుతున్నవారికి ఎలక్ట్రిక్ వాహనాలు వరంలా మారుతున్నాయి.మార్కెట్‌లో చాలా రకాలం ఎలక్ట్రిక్ వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా చాలా రకాలం ఎలక్ట్రిక్ వెహిలక్స్‌ను అందిస్తున్నాయి.ఇక ఇప్పుడు మనం ఎస్సెల్ ఎనర్జీ కంపెనీ అందిస్తున్న గెట్ 1 అనే ఎలక్ట్రిక్ బైసైకిల్ గురించి తెలుసుకుందాం. దీని ధర కూడా చాలా తక్కువ. ఫీచర్లు మాత్రం సూపర్ అనే చెప్పాలి. అందుకే కొంచెం దూరం ప్రయాణించే వారికి ఇది చాలా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.ఇంకా ఈ ఎస్సెల్ ఎనర్జీ గెట్ల 1 ఎలక్ట్రిక్ బైసైకిల్‌కు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని లేదు. ఇంకా దీన్ని నడపడానికి లైసెన్స్ కూడా ఉండాల్సిన పనిలేదు.ఇంకా మీరు సులభంగానే దీన్ని కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో దీని దర కూడా చాలా తక్కువగానే ఉంది.ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ మొత్తం రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.దీని బ్యాటరీ కెపాసిటీ మారుతుంది.అందులో ఒక దానిలో 48 వీ 13 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే మరో దానిలో 48 వీ 16 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది.


ఇక 13 ఏహెచ్ బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర రూ. 41,500గా ఉంది. ఇంకా అదేవిధంగా 16 ఏహెచ్ బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర మొత్తం రూ. 43,500గా ఉంటుంది. అంటే ధర అందుబాటు ధర అని చెప్పుకోవచ్చు. కేవలం 10 పైసల ఖర్చుతో ఏకంగా కిలోమీటర్ వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది.ఇంకా అలాగే ఇందులో రియర్ డబుల్ షాకర్, టెయిల్ లైట్ విత్ ఇండికేటర్స్, ఎక్స్‌ట్రా స్టోరేజ్ బాక్స్, ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ లైట్, ఫ్రంట్ బాస్కెట్ ఇంకా ఫ్రంట్ డబుల్ షాకర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇంకా ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు ఉంటుంది.దీనికి ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. అలాగే వాటర్ ప్రూఫ్ కేబుల్ కలిగి ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 50 కిలోమీటర్లు వెళ్లొచ్చు. దీనికి చార్జింగ్ టైమ్ 5 నుంచి 6 గంటలు పడుతుంది. మన రెగ్యులర్ అవసరాలకి ఇది బాగా పని చేస్తుంది.కేవలం రూ. 80 ఖర్చుతో ఏకంగా 800 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: