చాలా తక్కువ ధరలో మంచి స్కూటర్ ని కొనాలనుకునేవారికి సూపర్ గుడ్ న్యూస్.ప్రముఖ టూ వీలర్ కంపెనీ అయిన హీరో కంపెనీ సరికొత్త స్కూటర్ ను రిలీజ్ చేసింది. మార్గెట్ లో లభిస్తున్న స్కూటర్లలో ఇదే చాలా చౌక ధరలో లభించే స్కూటర్ అని చెప్పవచ్చు.ఈ స్కూటర్ ను సరికొత్త అప్డేటెడ్ ఫీచర్లను జోడించి హీరో కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. జనవరి 30, 2023న జూమ్ LX, జూమ్ ZX వెర్షన్ లను కంపెనీ విడుదల చేసింది. తాజాగా వాటిని డెలివరీ చేయడాన్ని హీరో మోటోకార్ప్ స్టార్ట్ చేసింది. 110సీసీ మోడళల్లో ఆ కంపెనీ నుంచి అందిస్తున్న మూడవ స్కూటర్ ఇది. ప్రస్తుతం దగ్గర్లోని షోరూమ్ ల్లో ఈ స్కూటర్లు మీకు అందుబాటులో ఉన్నాయి.కంపెనీ H-ఆకారంలో LED DRL, ప్రొజెక్టర్ లెన్స్ ఇంకా LED హెడ్‌ ల్యాంప్‌ ను కలిపి స్పోర్టి స్టైలింగ్‌ తో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్టైల్ హెడ్ లైట్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే 110 సీసీలో మొట్టమొదటిసారి కార్నరింగ్ ల్యాంప్స్ ను తీసుకువచ్చిన ఏకైక స్కూటర్‌ గా ఈ స్కూటర్ నిలిచింది. ప్రత్యేక ఆకర్షణగా ఈ లైట్స్ ఆకట్టుకోనున్నాయి.


అలాగే ఈ సరికొత్త 110లో ఇతర ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్, i3S స్టార్ట్-స్టాప్ సిస్టమ్, USB పోర్టల్ ఛార్జర్ ఇంకా అలాగే బూట్ లైట్‌ తో కూడిన అండర్-సీట్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఇంకా అలానే 12-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇంకా కాంబి-బ్రేకింగ్‌ తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ ను ఈ స్కూటర్ కి అమర్చడం జరిగింది. అందువల్ల ఒకేసారి స్కూటర్ ను చాలా ఈజీగా నిలిపి వేయవచ్చు.ఇంకా అలాగే దీంతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఆధారంగా ఫీచర్ కాల్ SMS అలెర్ట్ ఫెసిలిటీని కూడా కంపెనీ కల్పించింది. ఫ్యూయల్ అలెర్ట్, స్కూటర్ ను ఎవరైనా దొంగతనం చేసేందుకు ప్రత్నిస్తుంటే వెంటనే ఇది వెంటనే అలర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ట్రాక్-మై-వెహికల్, టెలిమెట్రీ డేటా మొదలైన అన్ని ఫంక్షన్‌ లను కూడా ఈ స్కూటర్ అందిస్తుంది. ఈ అధునాతన ఫీచర్లనేవి యూసర్ ఫ్రెండ్లీగా ఉంటాయన కంపెనీ వెల్లడించింది. తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లతో వస్తున్న ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: