ఇండియాలో రోజురోజుకూ కూడా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు బాగా పెరుగుతోంది. అందువల్ల పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఎంజీ కంపెనీ సిటీ అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని ఓ కారును లాంచ్ చేసింది. ఈ కార్ చూడటానికి టాటా నానో లుక్ లో ఉన్న కారు లాగానే ఉంది. ఇప్పుడు కంపెనీ దాని పేరుని కూడా రివీల్ చేసింది.ఎంజీ కామెట్ గా దీనికి పేరు పెట్టింది. ఈ కార్ లో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి.ఇక కామెట్ అనేది ఒక చిన్న ఎలక్ట్రిక్ కార్. ఇది సూపర్ అప్డేటెడ్ టెక్నాలజీతో రాబోతోంది. అయితే ఇది చిన్న కారు కావడంతో దీనికి కేవలం రెండు తలుపులు మాత్రమే ఉంటాయి. ఇది చూడడానికి చాలా చిన్న సైజ్‌లో ఉంటుంది.ఇంకా అంతేకాకుండా రూమి వీల్‌బేస్, లోపల ఓపెన్ ఇంటీరియర్‌ ఫీచర్లు కూడా  ఉన్నాయి. ఇక ఈ కారు ధర విషయానికొస్తే.. ఈ కార్ రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో ఉండబోతోందని సమాచారం తెలుస్తుంది.ఇక కామెట్ ఈవీ 2.9 మీటర్ల పొడవు ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఇది భారతదేశంలోనే అతి చిన్న హ్యాచ్‌బ్యాక్‌ కార్ గా నిలిచింది.


ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో కార్ పొడవు 3.4 మీటర్లు ఉంటుంది. అలాగే టాటా నానో పొడవు 3 మీటర్లు ఉంటుంది.ఇక దీనిలోని బ్యాటరీ ప్యాక్ 20kWh ఉండే అవకాశం ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల డ్రైవింగ్ మైలేజిని ఇస్తుంది. దీనిలో 40 బిహెచ్‌పి పవర్ ని ప్రొడ్యూస్ చేసే మోటార్ ఉంటుంది.అలాగే పెద్ద టచ్‌స్క్రీన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది.ఇంకా ఆటోమొబైల్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.ఇక కామెట్ అనే పేరు 1934 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పోటీపడిన బ్రిటిష్ విమానం నుంచి తీసుకున్నారని కంపెనీ తెలిపింది. ఆ కాలంలో కామెట్ విమానానికి చాలా పెద్ద గుర్తింపు ఉండేదని, ఇంకా అంతేగాక ఆ విమానంతో చాలా యుద్దాలు కూడా చేసేవారట. అందుకే ఈ కారుకు ఎంజీ కామెట్ అని పేరు పెట్టారట. ఈ కారును కేవలం ఇండియాలోనే విడుదల చేయడమేకాకుండా అంతర్జాతీయం స్థాయిలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ  తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

MG