బెంగళూరు సిటీకి చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఏప్రిల్ నెలలో కమర్షియల్ గా లాంచ్ చేయనుంది.ఈ స్కూటర్ 2021 వ సంవత్సరంలోనే లాంచ్ చేసి అదే సమయంలో మార్కెట్లో విడుదల చేశారు. అప్పట్లో దీని ధర రూ. 1.09లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ స్కూటర్ ను రీలాంచ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక ఈ స్కూటర్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది.ఇకపై వచ్చే బుకింగ్స్ కు చాలా వేగంగా డెలివరీలు చేసేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ముందుగా బెంగళూరులో దీని డెలివరీలు స్టార్ట్ చేసి తర్వాత నెమ్మదిగా ఇతర నగరాల్లో కూడా డెలివరీలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్త స్కూటర్ ను తమిళనాడులోని సింపుల్ విజన్ 1.0 ప్లాంట్ లో త్వరలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్కూటర్ కోసం బుక్ చేసుకున్న వారు చాలా కాలం నుంచి డెలివరీల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని సమస్యల కారణంగా బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీలు సమయానికి ఆ కంపెనీ ఇవ్వలేకపోయింది.


ఈ స్కూటర్ ని లాంచ్ చేసిన సమయంలో దీని ధర రూ. 1.09 లక్షలు గా ఉంది. ఇప్పుడు దీని ధర మొత్తం రూ. 1.45 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంది. ఈ స్కూటర్ మార్చుకోదగిన బ్యాటరీ 4.3 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఈ స్కూటర్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 236 km మైలేజీ వస్తుంది.మార్చుకోదగిన బ్యాటరీ సాయంతో మొత్తం 300 కిలోమీటర్ల దాకా ప్రయాణించవచ్చు.ఈ స్కూటర్లో 8.5 kw ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 11బీహెచ్పీ శక్తిని, 72 ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. దీనికి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా అలాగే ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది.ఇంకా 4జీ కనెక్టివిటీతో కూడిన బ్లూటూత్ ఉంటుంది. దీని ద్వారా మ్యూజిక్ వినవచ్చు. కాల్స్ మాట్లాడవచ్చు. అన్ బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అలాగ వివిధ రకాల డ్రైవింగ్ మోడ్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ స్కూటర్ అజ్యూర్ బ్లూ, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, నమ్మా రెడ్ వంటి కలర్ ఆప్షన్లలో వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: