ఫేమస్ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్‌ సింగిల్-పీస్ సీట్‌' బైక్ ని లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ (SmartXonnect) వేరియంట్‌కి కింద ఉంటుంది.ఈ బైక్ ని కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ కింద తయారు చేసింది. ఈ బైక్ ధర, వివరాలు గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త టీవీఎస్ రైడర్‌ సింగిల్ పీస్ సీట్‌ మోడల్ ధర వచ్చేసి రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ వేరియంట్ ధర లక్ష దాకా ఉంటుంది. అయితే టీవీఎస్ కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్‌ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ని నిలిపివేసింది.టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ కలిగి ఉంది. ఇక ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్ ఇంకా గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.


ఇంకా అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్ ఇంకా అలాగే సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి.ఈ టీవీఎస్ రైడర్ ఇంజిన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ కలిగి 11.4 హెచ్‌పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ దాకా స్పీడ్ ని అందుకుంటుంది.టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఇంకా మోనోషాక్‌ కలిగి ఉంటుంది. అదే సమయంలో దీని బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్‌ ని పొందుతుంది. ఈ బైక్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల దాకా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TVS