ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన శ్రేణిలో నంబర్ వన్ బ్రాండ్ గా ఓలా కంపెనీ వెలుగొందుతోంది. ఇదే క్రమంలో ఓలా సీఈఓ నుంచి మరో సూపర్ న్యూస్  వచ్చింది. ఓలా కంపెనీ నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నట్లు ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు. ఈ మేరకు ఓ టీజర్ ను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అలాగే టెస్ట్ రైడ్లు, డెలివరీలు ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభం కానున్నాయి.ఇక ఓలా సీఈఓ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రత్యేక టీజర్ ను పోస్ట్ చేశారు. అందులో తమ మొదటి ఓలా ఎస్ 1 వెహికల్స్ ని టెస్ట్ డ్రైవ్ చేశామని, చాలా బాగుందని,అలాగే వినియోగదారులకు వద్దకు జూలై నెల నుంచి వస్తుందని ట్వీట్ చేశారు. 


ఇంకా అంతేకాక ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ 1 స్కూటర్ కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోందని కూడా ఆయన ప్రకటించారు. ఇదే తమ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని భవిష్ పేర్కొన్నారు.ఇక ఈ ఓలా ఎస్1 ఎయిర్ వెహికల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2kwh, 3kwh, 4kwh బ్యాటరీ సామర్థ్యాలతో ఉండే ఈ వెహికల్స్ ధరలు రూ. 84,999,రూ, 99,999, 1,09,000 ఎక్స్ షోరూమ్ గా ఉన్నాయి. వీటిలో 4.5kw పవర్ రిలీజ్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక 2kwh బ్యాటరీ ఉండే వాహనం సింగిల్ చార్జ్ పై మొత్తం 85 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. ఇంకా అలాగే 3kwh బ్యాటరీ ఉండే స్కూటర్ 125 కిలోమీటర్లు అలాగే 4kwh బ్యాటరీ సామర్థ్యంతో ఉండే స్కూటర్ 165 కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: