భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ  అయిన టాటా మోటార్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిల్డ్ క్వాలిటీతో టాటా కంపెనీ దూసుకుపోతుంది. ఇక దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తన టాటా సఫారీ కారును అప్‌డేట్ చేసింది. ఈ కార్ లో కొత్త టెక్నాలజీ ఫీచర్లతో పాటు ఇంటీరియర్ ఇంకా అలాగే ఎక్స్‌టీరియర్‌లో కూడా కంపెనీ చాలా మార్పులను చేసింది.ఇక అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.కొత్త టాటా సఫారీ కార్ డిజైన్‌ విషయానికి వస్తే ఎక్స్‌టీరియర్‌ మిడ్‌- సైకిల్‌ ఫేస్‌లిఫ్ట్‌ లాగా మార్పులు చేశారు. ఇంకా అలాగే అప్‌డేటెడ్‌ కొత్త పారామెట్రిక్‌ గ్రిల్‌తో పాటు ఎగువ భాగంలో స్పోర్ట్స్‌ బాడ్‌- కలర్‌ ఇన్వర్టులు, టాటా బ్యాడ్జ్‌ ఇంకా దిగువ భాగంలో రాడార్‌ సెన్సార్‌తో పాటు బ్లాక్‌ ఇన్‌స్టర్‌లు అలాగే ముందు భాగంలో సిల్వర్‌ బాష్‌ ప్లేట్‌పైన ఎయిర్‌ ఇన్‌టేక్‌ ఉన్నాయి.ఈ కొత్త 2023 టాటా సఫారీ ఇంటీరియర్‌ను ఎంతో అధునాతమైన టెక్నాలజీతో పాటు క్యాబిన్‌ను అత్యంత విశాలంగా తీర్చిదిద్దారు.


కార్ kiపెద్ద 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో పాటు 360-డిగ్రీ కెమెరా కూడా ఉంది. ఇంకా అలాగే ఇది కొత్త డ్యాష్‌బోర్డ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.నావిగేషన్‌తో సహా ప్రయాణంలో మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని మనం దీని ద్వారా పొందవచ్చు.స్టెల్లాంటిస్-సోర్స్డ్ 2.0-లీటర్ క్రియోటెక్, టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్ ఇంకా ఫోర్-పాట్ డీజిల్‌ను కొత్త టాటా సఫారీ ఇంజిన్లో ఫిక్స్ చేశారు. డీజిల్ ఇంజిన్ 3,750 rpm వద్ద 168bhp, 1,750 ఇంకా 2,500rpm మధ్య 350 Nm గరిష్ఠ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా హ్యుందాయ్ నుంచి తీసుకున్న 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో యాడ్ చేశారు. ఈ కార్ లో మొత్తం మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్‌ ఆప్షన్లు.ఈ కార్ ఫారెన్ కార్లకు ఏమాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: