ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్'  5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం గాను ట్రేడ్‌మార్క్‌ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారట.మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే  సైజులో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ లాగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంచెం అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా ఇంకా పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం తెలుస్తుంది.


చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది.ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో లభించే ఛాన్స్ ఉంది.మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం తెలుస్తుంది.అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ టైంలోనే తెలుస్తాయి.ఈ కార్ కోసం దేశావ్యాప్తంగా ఎందరో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ కార్ పై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: