మిడ్ SUV అమ్మకాలలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా కంపెనీ సరికొత్త అప్‌డెట్‌ వెర్షన్‌లో వాహనాలను విడుదల చేస్తోంది. సూపర్ అప్‌డేట్‌తో XUV700 SUV కార్ ని విడుదల చేసింది.ఈ కొత్త కారు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షలుగా ఉంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. ఇది MX, AX3, AX5, AX7, AX7 లగ్జరీ వేరియంట్‌లలో వస్తుంది, MX వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు కాగా, AX3 వేరియంట్ ధర రూ. 16.39 లక్షలు, AX5 వేరియంట్ రూ.17.69 లక్షలు, AX7 వేరియంట్ రూ. 21.29 లక్షలు ఇంకా AX7 లగ్జరీ వేరియంట్ రూ. దీని ధర 23.99 లక్షలుగా ఉంది.2021లో మొదటి సారిగా భారత్‌లో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్ మోడల్ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డును సాధించింది. ఇక ఇప్పుడు కొత్త మార్పులతో మార్కెట్లోకి ప్రవేశించింది. టెక్నాలజీ పరంగా కొన్ని మెరుగైన ఫీచర్లు కాకుండా, కొత్త కారు మునుపటి మోడల్‌కు సమానంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ కార్ అప్‌డేట్ చేయబడిన క్యాబిన్, ఎయిర్ వెంట్స్, సెంట్రల్ కన్సోల్‌లో డార్క్ క్రోమ్ ఫినిషింగ్, నాపోలి బ్లాక్ కలర్ ఆప్షన్‌తో వస్తుంది.ఇక ఈ కొత్త XUV700  AX7, AX7 లగ్జరీ వేరియంట్‌లకు ఈసారి ఎక్కువ స్థాయి ఫీచర్లు అందించబడ్డాయి.


ఈ కొత్త కారు రెండవ వరుస సీటుకు కెప్టెన్ సీటు ఇంకా ఫ్రంట్ సీట్ వెంటిలేషన్‌తో సహా ఆల్ బ్లాక్ థీమ్ కూడా ఇవ్వబడింది. ఇంకా దీనితో పాటు, కొత్త కారులో మునుపటి మోడల్‌లోని పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆన్షన్లను కూడా అందించడం జరిగింది.ఈ XUV700 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఎంపికలతో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 198-bhp, 300-Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.అయితే డీజిల్ మోడల్ 183-bhp, 450-Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.ఇంకా దీనితో పాటు కొత్త కారులో వివిధ  ఫీచర్లను కలిగి ఉన్న  కనెక్టివిటీ అందించింది.  సీట్ మెమరీలో వింగ్ మిర్రర్ కంట్రోల్ యూనిట్ జోడించింది కంపెనీ.ఇంకా అలాగే, కొత్త కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ లాకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్ బూస్టర్, పర్సనలైజ్డ్ సేఫ్టీ అలర్ట్, డ్రైవర్ డ్రెడ్‌నెస్ అలర్ట్ ఇంకా అలాగే లేన్ కీప్ అసిస్ట్ జోడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: